రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్??
అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి
– ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻
నిజామాబాద్:
మోస పూరిత హామీలతో రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్నా చేయడం సిగ్గు చేటని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపి అరవింద్ ను ఉద్దేశించి అన్నారు.
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ x రోడ్ లో మంగళవారం ఎంపి అరవింద్ అధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నా పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండి పడ్డారు. ఈ సందర్బంగా అరవింద్ ను ప్రశ్నిస్తూ…ఆర్మూర్,బాల్కొండ నియోజకవర్గ రైతులకు పలు అంశాలపై వివరిస్తూ సోమవారం వీడియో విడుదల చేశారు.
నన్ను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపుబోర్డు తెస్తా, ఎర్ర జొన్నలకు,చెరుకు కు మద్దతు ధర ఇప్పిస్తా అని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు తప్పించుకు తిరుగుతూ రైతులను మోసం చేశావని ఎంపి అర్వింద్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావని మండిపడ్డారు.నీ మోసపు మాటలు రైతులు ఇంకా నమ్ముతారా అని ప్రశ్నించారు. రైతులను గందరగోళ పరిచేందుకు కుట్రలో భాగంగానే రైతు పేరుతో ధర్నా చేస్తున్నావన్నారు.ఎంపీ గా గెలిచిన అరవింద్ ఒక్క హామీ అయినా నెరవేర్చినాడా..? ఆర్మూర్, బాల్కొండ ప్రాంత రైతులు ఆలోచన చేయాలని కోరారు.అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలని సూచించారు.
ఫసల్ భీమా తెలంగాణలో అమలు చేయాలని మాట్లాడుతున్న అరవింద్ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం బీజేపీ పాలిత గుజరాత్ లో ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు.
నిజామాబాద్ జిల్లాలో రైతులకు కేసిఆర్ అన్ని చేస్తున్నాడని గుర్తు చేశారు. పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10 వేల చొప్పున 2వేల 120 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతు దురదష్టవశాత్తూ మరణిస్తే రైతు భీమా కింద 5 లక్షల చొప్పున 3వేల 749 రైతు కుటుంబాలకు సుమారు 146 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చామన్నారు. కేంద్రం సహకరించకున్నా…జిల్లాలో 460 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సుమారు 20 వేల కోట్ల రూపాయల పంటలు కొనుగోలు చేసి డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేశామన్నారు. 2వేల కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం తెచ్చి కేసిఆర్ శ్రీరామ్ సాగర్,వరద కాలువ,కాకతీయ కెనాల్ ఎప్పుడూ నిండు కుండలా ఉండేలా మార్చారన్నరు. ఎండా కాలంలో కూడా గుత్పా లిఫ్ట్, అలీ సాగర్ లిఫ్టులు ద్వారా నింపుకున్నమని చెప్పారు. దీని ఫలితాలు అనుభవిస్తున్న రైతులకు ఈ విషయం తెలుసన్నారు. ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ ప్రాంత రైతులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై తనపై దుష్ప్రచారం చేస్తున్న అర్వింద్ వైఖరిపై ఆలోచన చేయాలనీ కోరారు.
అరవింద్ తలపెట్టిన ధర్నాకు రైతులు ఎవ్వరు మద్దతు తెలపొద్దని… అర్వింద్ తన మోసపు హామీల నుంచి రైతులను పక్క దోవ పట్టించేందుకు ఈ మోసపు ధర్నాకు పూనుకున్నడని అన్నారు.
ఆర్వింద్ మోసపు మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరనీ, రైతుల మీద కేసిఆర్ కు ఉన్న ప్రేమ ఈ ప్రపంచంలోనే మరెవ్వరికీ ఉండదని మంత్రి వేముల పునరుద్ఘాటించారు.