క్షమించు అత్తమ్మా…ఇంతమందిమీ ఉండి, నిన్ను కాపాడుకోలేకపోయాం.
’’నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు…‘‘అని ఈ కాలంలో కూడా అంటే, కార్పోరేటు దోపిడికి వంతపాడినోళ్లం అవుతామని నమ్మినోళ్లం. కానీ, ఈ నిర్లక్ష్యపు సర్కార్ ప్రభుత్వ వైద్యాన్ని ఏమేరకు పట్టించుకుందో…నీ ప్రాణాలు పోయిన తర్వాతగానీ మాకు మరోసారి తెలిసిరాలేదు. కనీసం సిటీ స్కాన్ కే దిక్కులేదు. అంతా బాగున్నది అంటూనే నిన్ను మాకు దక్కకుండా చేశారు.
ఇప్పుడు నీ కోసం గుండెలు బాదుకుంటున్న నీ కూతుర్లను ఓదార్చడం మా వల్ల కావడం లేదు అత్తమ్మ. ఎందరం ఉన్నా, నువ్వు లేక వాళ్లు దిక్కులేని పిల్లలయ్యారు.
కోవిడ్ తో నిన్ను చంపిన ఈ పాలకుల నిర్లక్ష్యాన్ని ఎప్పటికీ క్షమించం.
అల్లుళ్లను కూడా కొడుకుల్లా చూసుకున్న నీ మంచితనాన్ని మరిచిపోలేము.
నా నిస్సహాయత మీద నాకే జాలేస్తున్నది.
బాధాతప్త హృదయాలతో నివాళులు…
Pasunoori Ravinder
