ముఖ్యమంత్రి కేసిఆర్ కు ప్రస్తుత పరిస్థితుల పై మంత్రి వేముల ఫోన్లో వివరించారు.

ప్రస్తుతం ఎస్సారెస్పీ కి 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. 36 గేట్లు ఎత్తి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన మహారాష్ట్ర నుండి వరద ప్రవాహం ఎక్కువ వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రాత్రి వరకు 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

డ్యామ్ కింది గ్రామాల్లోని ప్రతి గ్రామానికి చెందిన ప్రజాప్రతనిధులకు,నాయకులకు మంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. రాత్రి వరకు దిగువకు ఎక్కువ నీటిని వదిలే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎవరు బయటకు రావొద్దని అట్లాగే రెవెన్యూ, ఎలెక్ట్రిసిటీ,పోలీస్ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన అధికారులు గ్రామాల్లోనే ఉండాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వీలైతే పునరావాసం కల్పించి, భోజన వసతులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు.

విద్యుత్ అంతరాయం ఏర్పడిన గ్రామాల్లో వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

You missed