బిడ్డా! నువ్వు గనుక తెలంగాణలో చిచ్చు పెట్టావంటే మర్యాద దక్కదు!
••••
BJP మరో విష ప్రయోగం చేయనుందా? తెలంగాణలో రజాకార్ల నేపథ్యంలో సినిమాతో హిందువులు ముస్లింల మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నం జరుగుతుందా? జానపద కథలను వక్రీకరించడంలో ఇతను దిట్ట. అలాంటిది రజాకార్లంటే కేవలం ముస్లింలే అని వక్రీకరించగలడు.
రజాకార్లలో 60 శాతం మంది ముస్లింలు కారు. ఆ చరిత్ర భారం ఇప్పటికే సామాన్య ముస్లింలు సైతం మోస్తున్నారు..
బీజేపీ రజాకార్ ఫైల్స్ సినిమా తీస్తామని విషం కక్కడం, ఇతగాడితో బీజేపీ వాళ్లు కలవడం, ఇతడికి రాజ్యసభ సీటు ఇవ్వడం.. ఇవన్నీ తేడా కొడుతున్నాయి.
గంగా జమున తెహజీబ్ కు, అలాయిబలాయి సంస్కృతికి ఆలవాలమైన తెలంగాణలో చిచ్చు రేపే అవకాశం ఉన్న ఇలాంటి వారి ప్రయత్నాలను తెలంగాణ బిడ్డలు తిప్పికొట్టాలి!
Sky Baaba