సోషల్ మీడియాలో ఓ సైటర్ చక్కర్లు కొడుతోంది. కేంద్రం రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్న తర్వాత వాళ్లకెందుకిచ్చారో అని కొంత మంది సెటైర్లు వేస్తుంటే.. మధ్యలో లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణను లాక్కొచ్చారు. ఆయనకెందుకు రాజ్యసభ ఇయ్యలేదు… ఆయన బీజేపీని ఎంత సమర్థించాడు… అంటూ ఏకరువు పెట్టారు. వెటకారం జోడించారు.
నోట్ల రద్దు సమర్థించారు
జీఎస్టీని సమర్థించారు.
సీఏఏ ఎన్ఆర్సీని సమర్థించారు.
అగ్నిపథ్‌ను సమర్థించారు.
పెట్రోల్, డీజీల్, గ్యాస్ రేట్లనూ సమర్థించారు.
రైతు నల్ల చట్టాలనూ సమర్థించారు.
బీజేపీ అధికార ప్రతినిధుల కంటే ఎక్కువగా బీజేపీ విధానాలను సమర్థిస్తూ రోజూ అన్ని టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తుంటే గుర్తించరా..?
ఇలా సాగిందా వెటకారం… పాపం జేపీ మధ్యలో నిన్నాడిపోసుకోవడమేంది..? నీ మానాన నువ్వు హాయిగా ఉన్నా సుఖంగా బతకనిచ్చేలా లేరు… మరి రాజకీయాలంటే ఇట్లనే ఉంటయి.. సారు…

