ఆర్జీవీ. ఇత‌గాడో వింత‌జీవి. గాలి లేకుండానైనా బ‌త‌క‌గ‌లుగుతాడేమో గానీ.. ప‌బ్లిసిటీ లేకుండా జీవించ‌లేని జీవి ఈ ఆర్జీవీ. వోడ్కా గొంతు దిగిందో అత‌ని ట్విట్ట‌ర్ గూటిలోని పిట్ట‌కు రెక్క‌లొస్తాయి. గొంతుకు జీవం వ‌స్తుంది. మాట‌ల ప‌రాచికాలు, వెకిలి కామెంట్లు పురివిప్పుతాయి. అలా వోడ్కా పెగ్గులు గొంతులోకి జారుతూ ఉంటే ఆ మాట‌ల గొంతుకు జీర మారుతుంది. ఎంత‌టి వారైనా ఆ సంద‌ర్బంలో అవి మ‌రింత ప‌దునెక్కి అలా గూట్లో గుడ్లు పెడ‌తాయి. ఇంకేం…అంత అగ్గి. తిట్టినోడే కానీ తిట్ట‌నోడుండ‌డు. అదే కావాలి మ‌నోడికి. స్పైడ‌ర్ సినిమాలో సైకో విల‌న్ పాత్ర వేసిన సూర్య లాగ‌న్న‌మాట‌. సూర్య అంద‌రి ఏడుపులు విని వీనుల విందుగా ఆనందం పొందితే…మ‌నోడు అంద‌రితో నోరారా తిట్టించుకుని అలా క‌డుపారా న‌వ్వుకుని.. మ‌రోసారి వోడ్కా గొంతులో వొంపుకుంటాడ‌న్న‌మాట ఆనందంగా.

తాజాగా ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్ధి ద్రౌప‌తి పేరును కూడా వాడేసుకున్నాడు త‌న ప‌బ్లిసిటీ పిచ్చికి. అది మ‌రీ ప‌రాకాష్ట‌కు పోయి.మూతి ముడ్డి కాల్చేదాకా వ‌చ్చింది. బీజేపీ వాళ్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఇదే ర‌చ్చ‌. ఇదే కావాల‌నుకుంటాడు మ‌నోడు. టీవీ9 మ‌రోటో మ‌రోటో… ఆర్జీవీ క‌న్నా ఎక్కువ‌గా ప్రచార పచ్చి ఉన్న చాన‌ళ్లు అత‌న్ని పిలుస్తాయి. మ‌రింత తిట్టిస్తాయి. రేటింగ్ కోసం. జ‌నాలు పిచ్చోళ్ల‌లా చూస్తారు.

సినిమాలు లేక ఆఖ‌రుకు కొండా అని ఓ రౌడీ చ‌రిత్ర‌ను కూడా తెర‌కెక్కించి మ‌రింత దిగ‌జారి పోయాడ‌ని ఇటీవ‌ల వార్త‌ల్లొకెక్కిన ఈ జీవి. మ‌ళ్లీ ఇలా ప్రెసిడెంట్‌పై వోడ్కా మ‌త్తులో నోటి దురుసులో, ప‌బ్లిసిటీ పిచ్చిలో … మ‌రింత పాతాళంలోకి పడిపోయాడు.