.పూరీ జ‌గ‌న్నాథ్‌. ఓ అగ్ర ద‌ర్శ‌కుడు. అత‌ని కుమారుడు ఆకాశ్ పూరి తీసిన తాజా సినిమా చోర్ బ‌జార్‌. సినిమా ప్రీ రిలీజ్ ప్రోగ్రాంకు వ‌చ్చిన బండ్ల గ‌ణేశ్‌… పూరీ కుటుంబంలోని సున్నిత అంశాల‌ను, ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టేసి ఓ చ‌ర్చ‌కు తెర‌లేపాడు. పూరీ జ‌గ‌న్నాథ్ కొంత కాలంగా భార్య‌తో క‌లిసి ఉండ‌టం లేద‌ని, ముమైత్‌ఖాన్‌తో స‌హ జీవ‌నం చేస్తున్నాడ‌నే పుకార్లు వ‌చ్చాయి. ఇగో ఇవే మాట‌ల‌ను ప‌రోక్షంగా పూరీ ప్ర‌స్తావించాడు. కొడుకు సినిమా ఫంక్ష‌న్‌కు రాకుండా ఎక్క‌డో ముంబ‌య్‌లో ఎ లా ఉంటావు..? అని నిల‌దీస్తూనే త‌న‌దైన శైలిలో పూరీని క‌డిగేశాడు బండ్ల‌. పూరీ భార్య ప‌ట్ల విప‌రీత‌మైన సానుభూతిని చూపాడు. ఎన్ని ఆటంకాలొచ్చినా.. సంసారంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా పిల్ల‌ల కోసం ఆమె ఓపిగ్గా ఉంద‌ని, ఆమె అంద‌రికీ స్పూర్తి అంటూ చెప్పుకొచ్చాడు. అంద‌రినీ హీరోఓల‌ను చేసిన పూరీ.. కొడుకు భ‌విష్య‌త్తు మ‌రిచిపోయాడంటూ దునుమాడాడు. ఆయ‌న ఎంద‌రినో హీరోల‌ను చేశాడ‌ని, వాళ్లెవ‌రూ ఇప్పుడు రాలేదంటూ పూరీ హీరోల‌ను కూడా ఓ రౌండ్ వేసుకున్నాడు. కుటుంబాన్ని విస్మ‌రించ‌డం త‌గ‌ద‌ని పూరీకి చుర‌క‌లంటించాడు. మ‌నం ఉన్న‌దే కుటుంబ కోసం అంటూ హిత‌బోధ కూడా చేశాడు. ఆకాశ్ త‌ప్ప‌కుండా స్టార్ అవుతాడ‌ని, అప్పుడు పూరీ అత‌ని కొడుకు డేట్ల కోసం ఎదురుచూడాల్సి వ‌స్తుంద‌ని, అస్సలు పూరీ క‌థ‌ను వినొద్ద‌ని ఆకాశ్‌ను అదే వేదిక‌గా కోర‌డం ఆ కుటుంబానికి, పూరీ మ‌ధ్య ఎంత‌టి ఆగాధం ఉందో బండ్ల మాట‌ల ద్వారా బ‌హిర్గ‌త‌మ‌యిన‌ట్ట‌యింది. ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో ఇదే టాక్‌.

https://fb.watch/dR6XQ15zEv/