అపవిత్రం,అన్యాయం దర్శనం….!!

తిరుమల గుడిని కట్టినప్పుడు రోజుకు 500 మంది ప్రశాంతంగా దర్శనం చేసుకునేటట్టు డిజైన్ చేసి కట్టిండ్రు…

కానీ ఇప్పుడు అదే గుడిలో రోజుకు 75 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు…దీనికోసం క్యూ లైన్లలో గంటలకు గంటలు కొన్ని సార్లు రోజులు కూడా వేచి ఉంటున్నారు…

దాంతోని అన్ని గంటలు వేచి ఉండడం వల్లా భక్తులు మల మూత్రాలకు అక్కడ ఉన్న టాయిలెట్స్ లోకి వెళ్లివచ్చి మళ్ళా క్యూ లో దర్శనానికి వెళుతున్నారు…

మన హిందు సంప్రదాయం ప్రకారం మలమూత్రాలకు వెళ్లి వచ్చినం అంటే స్నానం చేసే దేవుని దర్శనానికి వెళతాం కానీ ఇక్కడ అటువంటి వసతి లేక అపవిత్రపు దర్శనం జరుగుతున్నది…

ఇగ అన్యాయం ఏంది అంటే రష్ బాగా ఉన్నది అంటే గుడిలో 5-6 గడపల దూరం నుంచే లఘదర్శనం పేరిట తోసి పడేస్తున్నారు…దాంతోని ముసలివాళ్ళు,చూపు తక్కువ ఉన్నవాళ్లు,చిన్న పిల్లల్ని ఎత్తుకున్నవాళ్ళు అసలు దేవుణ్ణి చూడకుండానే బయటకు వస్తున్నారు…

వేలకు వేలు ఖర్చుపెట్టుకొని ఆ దేవుణ్ణి దర్శించుకోవాలనే ఆర్తి తో భక్తులకు చివరిగా అసంతృప్తే మిగులుతున్నది….కాబట్టి…

ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా తిరుమల గుడిని వెడల్పుగా చేసి డైలీ లక్ష మంది ఈజీ గా,ప్రశాంతంగా దర్శనం చేసుకునేటట్టు చెయ్యాలి…కానీ చెయ్యరు…

ఎందుకంటే…ఈజీ గా దర్శనం అయితే ఆదాయం తగ్గిపోతుంది…కాబట్టే పురావస్తు రూల్స్ ని అడ్డం పెట్టుకొని అదే గుడిలో జనాలను కుక్కుతుంటారు….

ఇది మన ఖర్మ….!!

Katpally Santhosh Reddy