చెరుకు నరేష్ రెడ్డి, జర్నలిస్ట్, సిద్దిపేట జిల్లా తొగుట మండల విలేకరిగా ఓ పత్రిక లో పని చేస్తున్నాడు… రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో జాయిన్ చేశారు, జర్నలిస్ట్ హెల్త్ కార్డు పని చేయదని ఆసుపత్రి వర్గాలు ఖరఖాండిగా చెప్పారు..ఇది జర్నలిస్ట్ దీన స్థితి….జర్నలిస్ట్లు సంఘాల నాయకులు నరేష్ రెడ్డి పక్షాన, గురించి మాట్లాడే వారే లేరా? . సహాయం చేసే చేతులె కరువైనయా .. ఇదేనా ఒక జర్నలిస్ట్ కి దక్కే గౌరవం…. రేఫు ఏ విలేకరికి కష్టం వచ్చిన ఇంతేనా…..ఆరోగ్య శాఖ మంత్రికి మెసేజ్ ద్వారా చెప్పిన సహాయం కావాలని….ఓకే అన్నాడు సార్, కొంత సేపటికి మంత్రి పీ ఏ ఫోన్ చేసిండు….. ఎల్ వో సి రాదట ప్రయివేటు ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటే….. Cmrf పధకం కింద హెల్ప్ చేద్దామన్నాడు..ఉన్న ఆశా పోయింది..!.. ట్రీట్మెంట్ కోసం రోజుకు లక్షా 50వేలు అవుతుంది…. మూడు రోజులు అయ్యింది ఆసుపత్రి లో చికిత్స జరగబట్టి…నరేష్ రెడ్డి కుటుంబం ఆర్ధికంగా ఉన్నది కాబట్టి ఖర్చుకు ఎవ్వరి దిక్కు చూడటం లేదు.. మరి పేద జర్నలిస్ట్ కి కష్టం వస్తే .. సచ్చుడే నా..? . జర్నలిస్ట్ ల ఐక్యత వర్ధిల్లాలి..

 

Venkata Ramana Rao Nellutla