నిఖత్ జరీన్ కు ముఖ్యమంత్రి 2కోట్ల నగదు ప్రోత్సాహకం
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం
2కోట్ల నగదు తో పాటు హైదరాబాద్ నగరంలో 600 గజాల నివాస స్థలం
ముఖ్యమంత్రి కేసిఆర్ కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు
నిజామాబాద్:
అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ కు మరియు జర్మనీలో జరిగిన ఐఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్ లకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక్కొక్కరికి రూ 2 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. తెలంగాణ ఖ్యాతిని,నిజమాబాద్ గౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన నిఖత్ జరీన్, ఈషా సింగ్ లకు
నగదు బహుమతితో పాటు బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కు మంత్రి వేముల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
