ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చోడు కూడా తెలంగాణ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటాడు, అది సాధ్యం కాదని పాపం వాడికి తెలియదు కానీ ఉహించుకుంటూ బతికేస్తాడు, అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి పిచ్చినా కొడుకులు కొంతమంది ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీలో 14 ఏళ్ళు మమేకమై పనిచేసిన అనుభవంతో చెప్తున్న కేసీఆర్ ను కొట్టాలంటే కేసీఆర్ కంటే గొప్పగా ఆలోచించేటోడు, కేసీఆర్ కంటే గొప్పగా వ్యూహాలు పన్నెటోడు మాత్రమే కేసీఆర్ ను ఓడించగలడు, ఈరోజు మన కళ్ళకు కేసీఆర్ బలహీనంగా కనిపించొచ్చు కానీ కేసీఆర్ బలహీనుడు కాదు, ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపించొచ్చు కానీ సమయం వచ్చినప్పుడు వాతావరణాన్ని తనకు అనుకూలంగా మేలుచుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.
తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ హ్యాండిల్ చేసిన తీరు కావచ్చు, 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ అధికారం పొందిన విధానం కావచ్చు ఆయనను తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఫలితాల తర్వాత బిత్తర మొఖాలు వేసారు.
2018 ఎన్నికల సమయంలో కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నా కూడా 63 సీట్ల నుండి 88 సీట్లు గెలిచింది.
ఓటమి తర్వాత ఇలా గెలిచారు అలా గెలిచారు అని ఓడిన వాడు మాట్లాడడం హాస్యాస్పదం, ఎందుకంటే ఎలా గెలిచారని కాదు గెలిచారా లేదా అనేదే ముఖ్యం.
కాబట్టి అధికారంలోకి వస్తామని పగటి కలలు కనడం ఆపండి, రైతుబంధు, రైతుబీమా లాంటి పధకాలు తెచ్చినప్పుడు వీటితో ఏమవుతుందని ప్రతిపక్షాలు ఇక్కిలించి నవ్వినయ్ 2018 ఎన్నికల్లో ఆ పార్టీలు గల్లంతయ్యాయి, 2023 ఎన్నికల కంటే ముందు రెండు, మూడు పధకాలు తెచ్చి, చిన్నా చితక పార్టీలను బరిలోకి దింపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీలు షేర్ చేసుకుంటే కేసీఆర్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం తధ్యం.
కేసీఆర్ పని అయిపొయింది ఇక మా పార్టీయే అధికారంలోకి వస్తుంది, నేనే ముఖ్యమంత్రిని అని ఉహించుకుని నోరు తిరగకున్నా కూడా ప్రమాణస్వీకార పత్రాన్ని బట్టిపడుతున్న వెదవ సన్నాసుల్లారా మీకు కేసీఆర్ చేతుల్లో నుండి అధికారం లాక్కోవడం చేతకాదు లాక్కునే సత్తా ఉన్నవాళ్ళని కట్టడి చేయకండి.
సందీప్ ఠాకూర్
