పాట‌లు కాపీ కొట్ట‌డంలో మ‌న వాళ్ల‌కు మించినోళ్లు లేరు. ఎవ‌రూ ఇందుకు అతీతులు కారు. ఎవ‌రి తెలివి మేర‌కు దొర‌క‌కుండా అలా కాపీ ట్యూన్‌లు క‌ట్టి .. కొత్త సినిమాల‌కు వ‌దిలి.. అవి హిట్ అయ్యాయ‌ని చంక‌లు గుద్దుకుంటుంటారు. ఈ కాపీలు కొట్టే దాంట్లో దేవీ శ్రీ ప్ర‌సాద్‌ను దాటేశాడు థ‌మ‌న్‌. తాజాగా స‌ర్కార్ వారి పాట సినిమాలో మ‌హేశ్ బాబు చెవిలో పువ్వులు పెట్టి వేరే సినిమా ట్యూన్‌ల‌ను కాపీలు చేసి వాడుకున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు థ‌మ‌న్‌తో. మీమ్స్ చేసి త‌మ క‌చ్చ తీర్చుకుంటున్నారు.

ఆగ‌డు, స‌రైనోడు, ఠాగూర్ సినిమాల పాట‌ల నుంచి ట్యూన్‌లు కాపీ చేసి మ‌హేష్ సినిమాలో పాట‌ల‌కు య‌థ‌చ్చేగా, త‌క్కుతుక్కుగా వాడేసుకున్నాడు. సాక్ష్యాల‌తో స‌హా ఇగో ఇలా బ‌య‌ట‌పెట్టి మ‌రీ ఇజ్జ‌త్ తీశారు. పాపం.. మ‌హేశ్ మ‌ధ్య‌లో బ‌లికా బ‌క్రాను చేశాడ‌నే సానుభూతిని కూడా కురిపిస్తున్నారు. ఇది మ‌న హీరోల‌కు మామూలే. మ‌న సంగీత ద‌ర్శ‌కుల‌కూ మామూలే. ఇలా ట్రోల్ చేయ‌డ‌మూ ప‌రిపాటే. ఇదిప్పుడు ట్రెండ్‌. ఎవ‌రేమ‌న్నా ఇదే కొన‌సాగుతుంది. తెలుగు సినిమాల‌కు క‌థ‌లే కాదు.. పాట‌లు కూడా దొర‌క‌డం లేద‌న్న‌మాట‌. ఇదో విషాదం….