తీరిక లేకుండా ఉండు.
కానీ క‌లవలేనంత‌.. మాట్లాడలేనంత‌గా కాదు.
నీవాళ్ల‌ను.. నీ మేలుకోరే వాళ్ల‌ను ఒక‌సారి క‌లువు. మాట్లాడు. క‌లిసి భోజ‌నం చెయ్యి.
తీరిక‌లేని నీ ప్ర‌యాణానికో విరామం దొరుకుతుంది.

ప్ర‌శాంతంగా ఉండు.
కానీ బ‌ద్ధ‌కించినంత‌గా.. ప‌నిలేనంత‌గా.. ప్ర‌యోజ‌నంలేనంత‌గా కాదు.
ఆరాటపడి.. పోరాటం చేస్తే..
అది బ‌ద్ధ‌క‌మైనా బ‌ద్ద‌లుకొట్టుకొని నిస్తేజ‌మైన నీ ఆలోచ‌న‌లకు ప‌దును పెట్టి ప్ర‌శాంత‌త‌నిస్తుంది.

తృప్తిగా ఉండు.
కానీ భార‌మ‌య్యేంత‌గా.. బాధ్య‌త లేనంత‌గా.. స‌చ్చీ బ‌తుకుతున్న‌ట్లుగా కాదు.
నిన్ను న‌మ్మికూడా ఎవ‌రో ఒక‌రుంటారు క‌దా.
వాళ్లు తృప్తి ప‌డేలా.. సంతృప్తిగా జీవించేలా చూస్తే.. అస‌లైన తృప్తి ఎక్క‌డుంటుందో తెలుస్తుంది.

సంపాదిస్తూ ఉండు.
కానీ సాయం చేయ‌లేనంత‌గా.. దానం చేయ‌లేనంత‌గా కాదు.
అచ్చగానికో.. బిచ్చ‌గానికో.. ఆర్తించిన‌వానికో.. కీర్తించిన‌వానికో అడిగితే ఆఠానో చారానో ఇయ్యి.
పైసైనా.. ఫ‌ల‌మైనా ఈ చేత్తో పెడితే ఆ చేత్తో వ‌స్తాయి.!

Daayi sreeshailam