ఓమిక్రాన్ లక్షణాలు ముందుగా గుర్తించింది సౌత్ ఆఫ్రికా మహిళా డాక్టర్ అంగిలేక్యూ కోటీజీ .
ఓమిక్రాన్ మైల్డ్ లక్షణాలను మాత్రమే కనబరుస్తోంది ఆమె చెప్పారు. ( దీని స్టడీ చేసి నేను మీకు చెప్పాను).
మొన్న ఆమె ప్రకటన చేస్తూ ఆ దశలో అనేక దేశాలనుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చిందని ఓమిక్రాన్ డేంజరస్ అని చెప్పమని బ్లాక్మెయిల్ చేసారని చెప్పింది.

ఎందుకిలా ?
అప్పటికే గోతికాడ నక్కల్లా ఫార్మాసూరులు కాచుకొని కూర్చొన్నారు. మందులు తయారు చేసి పెట్టుకొన్నారు. ఓమిక్రాన్ తో హానిలేదని తెలిస్తే వ్యాపార నష్టం కదా !
అయినా అమ్ముడు పోయిన కొన్ని శక్తులతో ప్రచారం చేశారు. వామ్మో ఓమిక్రాన్ చంపేస్తుంది. అదిగో లాక్ డౌన్. ఇదిగో లాక్ డౌన్ అని.

లాభం లేదు. మూడో వేవ్ ప్లాప్ సినిమా అయ్యింది.
ఇప్పుడు లోకల్ ఫార్మసురులు వాక్సిన్ గురించి నిజాలు మాట్లాడుతారా ? చెప్పండి.
గుండెపోటు మరణాలను వక్రీకరించి వామ్మో మీ గుండె పదిలం చేసుకోండి. ఇదిగో ఈ టెస్ట్ ఆ టెస్ట్ అంటూ మార్కెటింగ్ మొదలు పెట్టేసారు.
రక్తం రుచి మరిగిన గుంటనక్క గడ్డి తింటుందా ?

AMARNATH VASIREDDY

You missed