Post by Amarnath Vasireddy garu. ఓమిక్రాన్ కేసులు ప్రపంచం అంతా వ్యాపిస్తున్నాయి . దీని పై ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉందొ తెలుసు కొందాము.

1 . అమెరికా : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం యాభై కి గాను యాభై రాష్ట్రాల్లో ఓమిక్రాన్ ఉంది. అమెరికా అధ్యక్షుడు బిడెన్ లాక్ డౌన్ లాంటివి పెట్టడానికి నిరాకరించాడు . ప్రజలందరూ వాక్సిన్ వేసుకోవాలని పిలుపు నిచ్చాడు .

2 . ఇంగ్లాండ్ : ప్రపంచం లో అత్యధిక ఓమిక్రాన్ కేసులున్న దేశం . అయినా అక్కడ ఎలాంటి లాక్ డౌన్ లు లేవు . వారి ఆరోగ్య శాఖా మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేసారు .

ఇజ్రాయిల్ : లాక్ డౌన్ లు లేవు . ఫోర్త్ బూస్టర్ డోసులు వేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది .

ఫ్రాన్స్ : ఈ రోజు ఫ్రాన్స్ లో కేసులు ఒక లక్షా డెబ్భై వేలు . పాఠశాలలు మూసే ప్రసక్తి లేదని ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెస్ ప్రకటించాడు . వాక్సిన్ వేసుకొని వారికి పబ్లిక్ స్థలాల్లో అనుమతి ఉండదు .

దక్షిణాఫ్రికా : ఓమిక్రాన్ ను తొలి సారిగా గుర్తించిన దేశం . లాక్ డౌన్ ల వల్ల , క్వరెంటైన్ ల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ప్రభుత్వం ప్రకటించింది . దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఓమిక్రాన్ వల్ల పెద్దగా సమస్య లేదని తేల్చారు . టెస్టింగ్ ట్రేసింగ్ లాంటి పద్దతిని వారు వదిలిపెట్టేసారు . ఓమిక్రాన్ సోకడం అంటే కరోనా కు విరుగుడు అనేది వారి అభిప్రాయం .

ఇండియా లో ఢిల్లీ రాష్ట్రం : పాఠశాలల్ని మూసేసారు . బార్ లు హోటళ్లు యాభై శాతం కెపాసిటీ తో నడుపుకోవచ్చు . మార్చ్ 2020 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ పాఠశాలలు పెద్దగా నడవలేదు . చివరికి పొగమంచు సాకుతో కూడా పాఠశాలల్ని మూసేసారు .

చైనా : వారి వాక్సిన్ ఫెయిల్ అయ్యింది . ఇప్పుడు అక్కడ కేసులు పెరుగుతున్నాయి . తమ దేశం లో కోటి మందికి పైగా లాక్ డౌన్ లో ఉన్నట్టు చైనా ప్రకటించింది . ప్రపంచానికి లాక్ డౌన్ పద్దతిని బోధించింది ఈ దేశమే . ప్రపంచం లో ఎవరైనా లాక్ డౌన్ వద్దని చెబితే ఈ దేశం తిరిగి లాక్ డౌన్ డ్రామా లు ఆడుతుంది . తిరిగి లాక్ డౌన్ పెట్టేలా మానేజ్ చేస్తుంది . ఇప్పుడే అదే నడుస్తోంది . ఒక్క నెథర్లాండ్స్ ఇండియా లో ఢిల్లీ తప్పించి ఇప్పుడు ప్రపంచం లో ఎక్కడ లాక్ డౌన్ లేదు . తిరిగి లాక్ డౌన్ పెట్టించాలని చైనా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది .

లాక్ డౌన్ పెద్ద కుట్ర . లాక్ డౌన్ ఒక డ్రామా ! అది చైనాప్రపంచం లో అగ్ర రాజ్యం కావడానికి ఉపకరిస్తుంది . చిన్న చితక కంపెనీ లు మూతబడి పెద్ద కంపెనీ ల గుత్తాధిపత్యానికి తోడ్పడుతుంది . ఆన్లైన్ కంపెనీ ల కు , సాఫ్ట్ వేర్ కంపెనీ ల కు పెద్ద వరం .


Amarnath Vasireddy

You missed