సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జూన్ నెల వరకు రాజ్యసభ పదవికాలం ఉంది. అయితే మొన్న సోనియాను కలిసిన డీఎస్ వెంటనే పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఈనెల 22న డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. సోనియా సమక్షంలో చేరాన్నది డీఎస్ ఆకాంక్ష. ఇందుకు ఆమె కూడా ఓకే అన్నది.
పార్టీలో చేరేందుకు అంతా రెడీ అయిన తర్వాత.. సోనియా పిలుపు మేరకు ఆయన కొంత కాలం ఆగాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. పార్టీలో చేరేందుకు కొంత సమయం తీసుకున్న పర్వాలేదు.. ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా చేరాలని ఏమీ లేదనే మీమాంస నడుమ ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే డీఎస్ కోటా నిధులు మొన్న రాలేదు. ఇప్పుడు రెండు కోట్ల వరకు రావాల్సి ఉంది.ఆ నిధులను కూడా వినియోగించుకుని మూడు నెలల ముందు అంటే.. మార్చిలో చేరాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తున్నది.