అనుకున్న‌ట్టే జ‌రిగింది. ముందు నుంచి వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. టీఆరెస్‌లో చేరి రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న డీఎస్ చాలా రోజులుగా ఆ పార్టీ నుంచి దూరంగా ఉన్నాడు. మూహూర్తం కోసం చూస్తున్నాడు. మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం ఉండ‌గానే రాజ్య‌స‌భ‌కు రాజీనామ చేయ‌నున్నాడు. కాంగ్రెస్ గూటికి చేర‌నున్నాడు. ఈ రోజు సోనియాగాంధీని క‌లిసిన డీఎస్‌.. రాష్ట్ర రాజ‌కీయాల‌పై చ‌ర్చించాడు. పీసీసీ చీఫ్‌గా రెండు ప‌ర్యాయాలు ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఉమ్మ‌డి ఏపీలో రాజ‌కీయంగా ప‌ట్టుంది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని సోనియా భావిస్తున్న‌ది. రాహుల్ కూడా రాష్ట్ర రాజ‌కీయాల‌పై ఇంట్ర‌స్ట్ చూపుతున్నాడు. ఈ క్ర‌మంలోనే రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌గా ఇచ్చాడు. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఘ‌ర్ వాప‌సి పేరుతో పార్టీ వీడివా వాళ్లంద‌రినీ మ‌ళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు అధిష్టానం సానుకూలంగా ఉంది. ఈ క్ర‌మంలో డీఎస్ కూడా రాష్ట్ర రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మారాల‌నుకున్నాడు. టీఆరెస్‌లో చేరి త‌ప్పు ప‌ని చేశానని ప‌శ్చాత్తాప ప‌డే డీఎస్‌.. ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ పాత గూటికే చేర‌నున్నాడు. రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కాదు .. ఇందూరు రాజ‌కీయాల్లో కూడా డీఎస్ త‌న ప‌ట్టును కొన‌సాగించాల‌ని భావిస్తున్నాడు. ప్ర‌స్తుతం మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు కొత్త చ‌ర్చ‌కు తెర తీశాయి.

DS: కాంగ్రెస్‌లోకి డీఎస్‌.. ఈ పార్ల‌మెంటు సెష‌ల్‌లోనే నిర్ణ‌యం.. కొడుకు సంజ‌య‌తో క‌లిసి ఇందూర్‌లో కార్య‌క్ర‌మాలు… కార్య‌క్ర‌మానికి డీఎస్ శిష్యుల‌కు ఆహ్వానం..

D.Srinivas : లేచిప‌డిన కెర‌టం.. అజ్ఞాతం వీడేందుకు మ‌రో మూడు నెల‌లు…

You missed