రాజ‌మౌళి ఓ తెలివైన మోస‌కారి డైరెక్ట‌ర్. అది అత‌నే ఒప్పుకుంటాడు. RRR సినిమా క‌థ‌ను పూర్తిగా క‌ల్పితం చేసి కిచిడీ చేసి త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని, క‌మ‌ర్శిలైజ్ చేసుకుని, క్యాష్ చేసుకునేందుకు కావాల్సిన క‌లుషితమంతా జొప్పించేసి సినిమా తీసేశాన‌ని మ‌న జ‌క్క‌న్నే చెప్పాడు ప్రెస్‌మీట్‌లో.

కొమురం భీం, అల్లూరి సీతారామారాజులు ఇద్ద‌రూ క‌లిస్తే ఎలా ఉంటుంది అనే ఫిక్ష‌న్ ఆధారంగా ఆ సినిమా తీసుకున్నాడ‌ట‌. త‌నే చెప్పాడు. చ‌రిత్ర‌కు , ఈ క‌థ‌కు సంబంధ‌మే లేద‌న్నాడు. మ‌రి వాళ్ల పేర్లు, ప్రాంతాలు, క‌ట్టుబొట్లు, సంప్ర‌దాయ‌లు, ల‌క్ష్యాలు, నిజాం మీద కొమురం భీం పోరాటాలు .. ఇవ‌న్నీ మాత్రం త‌న సినిమాకు కావాలి. కానీ అది చ‌రిత్ర సినిమా కాకుడ‌దు. అలా తీస్తే పైస‌లు రాల‌వనుకున్నాడో .. త‌న‌దైన కిచిడీ క‌మ‌ర్శియ‌ల్ మేళ‌వింపు ఉంటేనే పాన్ ఇండియా సినిమా అవుతుంద‌నుకున్నాడో.. చ‌రిత్ర‌ను మాత్రం కూనీ చేసి పారేశాన‌ని మాత్రం నిజాయితీగా ఒప్పుకున్నాడు.

అయినా.. చ‌రిత్ర‌ను ఉన్న‌దున్న‌ట్టు తీయాలంటే గ‌ట్స్ కావాలె. ఈ తెలివైన మోస‌కారి ద‌ర్శ‌కుడికి పాన్ ఇండియా సినిమా కావాలి. కోట్లు కొల్ల‌గొట్టాలి. చ‌రిత్ర ఎవ‌డికి కావాలి. అందులోని సారాన్ని, ర‌సాన్ని మాత్రం పిండుకోవాలి. అదే చేశాడంట ఈ త్రిపుల్ ఆర్‌లో…

You missed