అంతరంగాలు

జర్నలిస్టు: చిన్నపుడు బాగా చదువుకుని వుండాల్సింది. ఈ బతుకు తప్పేది.

జర్నలిస్టు తండ్రి: వీడిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. వీడి జీవితం నా వల్లే పాడైంది.

జర్నలిస్టు తల్లి: అయ్యో, నా తండ్రికి స్థిమితమైన జీవితం లేదు కదా.

జర్నలిస్టు భార్య: పెళ్ళికి ఒప్పుకునే ముందు కొంచెం ఆలోచించాల్సింది. అమ్మా నాన్నల మాటవినివుండాల్సింది.

జర్నలిస్టుల అత్త మామలు: మన కుటుంబంలో ఇంకెపుడూ జర్నలిస్టుకు పిల్లనివ్వకూడదు.

పిల్లలు : నాన్న ఇంకేదైనా ఉద్యోగం చేసుంటే సాయంత్రాలు హాయిగా ఆడుకుని వుండేవాళ్ళం.

జర్నలిస్టు బాసు: ఏమీ చదవకుండా ఫీల్డ్ లోకి వచ్చేస్తారు. ఇంకేదైనా పని చూసుకోవాల్సింది.

ఇంటి ఓనరు: జన్మలో జర్నలిస్టుకు ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు.

PS: My wife insists that I should add this:

Journalist’s wife: I will never allow my kids to become journalists.
(FB memory)

– కూర్మనాథ్

You missed