కేంద్రాన్ని తిట్టీ తిట్టీ… దోషిగా నిల‌బెట్టి… చివాట్లు ఎన్ని పెట్టాలో అన్ని పెట్టి…

కాబ‌ట్టి.. అందుకే…

ఇందు మూలంగా…

కేంద్ర వైఖ‌రి వ‌ల్ల‌…

మోడీ తీరు తో…

మేము యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్ట‌డం లేదు….. ధాన్యం సేకరించ‌డం లేదు.. మీ ఖ‌ర్మ‌కు మీరు వ‌రి వేసుకుంటే మాకు సంబంధం లేదు.. అది ప్రైవేటు ముచ్చ‌ట‌. ప్ర‌భుత్వానికి సంబంధం లేదు. ఇగ మీ ఇష్టం. కేంద్రాన్ని ఏం చేస్కుంటారో చేస్కోండి. మా త‌ప్పేం లేదు. మేం మీ బంధువులం. వాళ్లే రాబంధులు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మ‌మ్మ‌ల్ని ఇబ్బంది పెట్ట‌కండి. మేము మీ వెంటే ఉంటాం. కానీ వ‌రి వేసుకుంటే మా బాధ్య‌త కాదు.. అని కేసీఆర్ చెప్పుకొచ్చాడు.

ఒక‌వేళ వ‌రి వేస్తే… ఆ ధాన్యాన్ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఇంట్లో, బీజేపీ పార్టీ ఆఫీసులో, ఇండియా గేట్ ద‌గ్గ‌ర పార‌బోస్తా అని కూడా చెప్పాడు. రెండూ ఆయనే మాట్లాడిండు. క‌డుపుల పేగులు తెగేదాక కొట్లాడినం కానీ విన‌లేదు. మెడ మీద క‌త్తి పెట్టి సంత‌కాలు తీసుకున్నారు. వానాకాలం ధాన్యం సేక‌రించాలంటే యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమ‌నే ష‌ర‌తు విధించి ఇదంతా చేశారు… అని కూడా చెప్పాడు.

ఒక్క ప్రెస్‌మీట్‌లో ఎన్ని మాట‌లు. ఎన్ని వంక‌ర‌లు. అప్పుడు మెడ మీద క‌త్తి పెడ్తే ఎట్లా ఒప్పుకున్నావు. అప్పుడే ధ‌ర్నా చౌక్ ద‌గ్గ‌ర మ‌హా ధ‌ర్నా ఒక‌టి ప్లాన్ చేయ‌క‌పోయావా? అప్ప‌టి అవ‌స‌రాలు అప్ప‌టివి. అప్ప‌టి స‌బంధాలు అప్ప‌టివి. అప్ప‌టి స్నేహ‌పూర్వ‌క ఇచ్చిపుచ్చుకోవ‌డాలు అప్ప‌టివి. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. అంతా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. క‌డుపులో ఉన్న‌దంతా క‌క్కేస్తున్నాడు కేసీఆర్‌. బాగానే ఉంది. కేంద్రం దోషి కాద‌న‌డం లేదు. కిష‌న్‌రెడ్డి సిపాయి కాదు. రండా. ఒప్పుకుంటాం. కానీ నువ్వు సిపాయి క‌దా…. మ‌రి కొనుగోలు కేంద్రాలు పెట్టు.. ధాన్యం సేక‌రించు.. కేంద్రం దిగిరాక‌పోతే రోడ్డెక్కు. మ‌హాధ‌ర్నాలు చేయి..

ఓ ర‌కంగా ధాన్యం సేక‌రిస్తాన‌ని కూడా ప‌రోక్షంగా చెప్పుకున్నాడు కేసీఆర్. ఆ ధాన్యాన్ని వంద‌లాది లారీల్లో కిష‌న్‌రెడ్డి ఇంటికి, బీజేపీ ఆఫీసుకు, ఢిల్లీ గేటుకు పంపుతాడంట‌. అయితే వ‌రి వేసుకోమ‌న్న‌ట్టేనా..? అబ్బ‌బ్బ ఎన్ని క‌న్ఫ్యూజ‌న్లో కేసీఆర్ కు. ఎంత ఫ్ర‌స్టేష‌నో క‌దా.