పాపం.. ఆకుల ల‌లిత‌. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా గెలిచే ఆర్మూర్ సీటును కాద‌ని, చివ‌రి నిమిషంలో టీఆరెస్‌లో చేరింది. అప్ప‌టికే ఆమె ఎమ్మెల్సీ. మ‌రోసారి ఎమ్మెల్సీని చేస్తామ‌నే ప్రామిస్ మీద అలా వ‌చ్చేసింది. అప్ప‌టికే అధికార పార్టీతో ఆమెకు అవ‌స‌రాలు అలాంటివి మ‌రి. స‌రే ఎవ‌రి అవ‌స‌రాలు వారివి. కాద‌న‌లేం. కానీ ఆ ప్రామిస్ నిల‌బ‌డ‌లేదు. ఎమ్మెల్యే కోటాలో త‌న పేరు వ‌చ్చేసింద‌ని సంబ‌ర‌ప‌డ్డ‌ది. కానీ రాలేదు. స‌రే, లోక‌ల్ బాడీస్‌లో త‌న‌కు క‌చ్చితంగా అవ‌కాశం వ‌స్తుంద‌ని భావించింది.

చివ‌రి వ‌రకూ స‌స్పెన్స్ పెట్టి… నామినేష‌న్ల‌కు చివ‌రి రోజుకు ఒక‌రోజు ముందు పేరు ప్ర‌క‌టించారు. ఇక సంబ‌రాలే సంబ‌రాలు. ఆమె మాక్లూర్ మండలంలో అభిమానుల ఆనందానికి హ‌ద్దు లేకుండా పోయింది. ప‌టాకులు కాల్చి పండుగ చేసుకున్నారు. ల‌లిత‌క్క ఎమ్మెల్సీ అయిపోయింద‌ని సంబ‌ర‌ప‌డ్డారు. కానీ చివ‌రి నిమిషంలో ల‌లిత‌క్క‌ను ప‌క్క‌న పెట్టి మ‌ళ్లీ క‌విత‌క్క‌కే ఇచ్చారు. ఈక్వేష‌న్లు అట్లా ఉన్న‌యి మ‌రి. ఎవ‌రేం చేస్తారు..? మ‌రి ల‌లిత‌క్క సంగ‌తేంది.? ఎటూకాకుండా చౌర‌స్తాలో నిల‌బ‌డి చూస్తున్న‌ది. కానీ అధిష్టానం ఆమెకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. క‌విత‌క్క‌ను పంపాల‌నుకున్న రాజ్య‌స‌భ‌.. ఇప్పుడు ల‌లిత‌క్క‌కు వ‌రించ‌నుంది.

అవును… నిజ‌మే. ప్రామిస్ అయితే చేశాడంట కేసీఆర్‌. ఆ చివ‌రి నిమిషం వ‌ర‌కు వ‌స్తుందా..? రాదా ..? తెలియ‌దు. అప్ప‌టికి మారే ఈక్వేష‌న్లు మాకేలా తెలుస్తాయి.. అంతే ఇప్ప‌టికైతే ల‌లిత‌క్క‌కు మాత్రం బంప‌ర్ ఆఫ‌రే.. కాల్చండి ప‌టాకులు అభిమానులారా..

You missed