కుటుంబ ఫ్యామిలీ డ్రామా భలే రక్తి కట్టింది. బాబుకు ఎవరు ఐడియాలిస్తారో తెలియదు కానీ.. తన సహజ శైలికి భిన్నంగా ప్రవర్తిస్తాడు ఒక్కోసారి. అదీ రాజకీయం కోసమే. అధికారం కోసమే. నడుము వంచి వంగి వంగి నమస్కరిస్తాడు. కానీ లోపల మనిషి అలాగే ఉంటాడు. అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాడు. అంతా నేనే.. అంతా నాకే.. నేనంటే నేనే.. ఎస్ నేనే.. నేనే.. అది చేసింది నేనే. ఇదంతా చేసింది ….నేనే నేనే. ఈ రోగం మాత్రం పోదు. అతనో మానసిక రోగి. ఆర్‌కే లాంటివాళ్లూ ఆ రోగాన్ని పెంచి పెద్ద చేశారు.
అవును..అవును అంతా మీరే. తెలంగాణలో అప్పుడు చదువులెక్కడివి..? రోడ్లెక్కడివి..? స్కూళ్లెక్కడివి..? గుడులెక్కడివి..? తినేందుకు తిండెక్కడిది..? అంతా నీ చలవే. నువ్వొచ్చిన తర్వాతే. ఇదే రోగంతో ఇంత వరకు తెచ్చుకున్నాడు. అందరినీ వాడుకుని వదిలేశాడు. కానీ అధికారం మాత్రం రాలేదు. ఆ నేనే నేనే అనే సుపిరియారిటీ మానసిక రోగం మాత్రం అట్లనే ఉంది. ఎవరో చెప్పినట్టున్నారు.
ఇట్ల కాదు గానీ గట్టిగా ఓ ఏడ్పు ఏడువు. అంతే నందమూరి వంశం రావాలి.. రావాలంటే నీ భార్యనే ముందు పెట్టుకో..అంతే సెంటిమెంట్ ప్లే చేయి.. రాక చస్తారా..? కలుగులోని ఎలుకల్లా అంతా వస్తారు. నీకు సంఘీభావంగా ఉంటారు. నీ ఒక్కడితో కాదు. నీ కొడుకును నమ్ముకుని చంకనాకి పోయావ్. మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ రావాలి. కానీ రాడు. నిన్ను నమ్మడు. అందుకే ఏడ్వాలి. ఏడ్చే ముందు అసెంబ్లీలో ఆ శపథం చూస్తూనే అర్థమవుతుంది నీకు అధికారం లేక ఎలా విలవిలలాడిపోతున్నావో.. ప్రజలను ఎంత చిన్నచూపు చూస్తున్నావో.. ఏంటీ… సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతావా… ? అది నీ చేతిలో ఉందా..? నీకు నువ్వే అయిపోతావా? మళ్లీ ధర్మం, అధర్మం అని ఓ పేరు. ప్రజలకు ఓ సవాలు. ధర్మం వైపు నిలుస్తారాల..? నిలువరా..? అని దబాయింపు. బెదిరింపు. థూ.. ఇక నువ్వు మారవు.
రామోజీతో ఎన్టీఆర్ మీద వేసిన కార్టూన్ల దగ్గర నుంచి… మోడీ భార్యను , కుటుంబాన్ని గేలి చేసి మాట్లడిన ప్రసంగాల వరకు నీ చరిత్ర అంతా సోషల్ మీడియాలో బయటపెడుతూనే ఉన్నారు. ఇది రాజకీయ చివరి ఘట్టమని తెలిసిపోయింది. ఇక రావడం కల్ల అని తేలిపోయింది. కొడుకు నట్టేటా ముంచాడన్నది స్పష్టమయ్యింది. ఇక బతికి బట్టడం కల్ల అని ఖుల్లం కుల్ల అయింది. ఓ పీకేలా ఓ ఆర్కే ఇచ్చిన స్క్రిప్ట్ పక్కాగా అమలు చేసి ఏడుపును కూడా ఇలా వాడుకోవచ్చని కొత్త రాజకీయాలకు నాంది పలకి.. ఇంట్లో ఉన్న వారందరనీ రోడ్డుపైకి తెచ్చి.. నందమూరి అభిమాన లోకాన్ని సానుభూతి ఎర చూపి నీ వైపు తిప్పుకుని, చేసిన తప్పులు, పాపాలన్నీ ఈ ఒక్క ఏడుపుతో వాళ్లంతా మరిచిపోయేలా కనికట్టు చేసి…..
కానీ ఏమాటకామాటే.. నీకిచ్చిన సలహా, నువ్వనుకున్నట్టు, మీరూహించినట్టు సూపర్ హిట్టే అయ్యింది బాబు..