కేటీఆర్ ఫేస్బుక్ వాల్ పై ఓ చిన్న సమాచారం. అవును .. చాలా చిన్న సమాచారమే. పెద్దగా ప్రాధాన్యత లేనిది. రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, కొండాపూర్ ఎంపీటీసీ నేపూరి పోచిరెడ్డి ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ ఎంపీటీసీ చికిత్స. చిన్న సమాచారమే. కానీ ఈ ఆస్పత్రికి వచ్చి ఆ ఎంపీటీసీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు కేటీఆర్. పరామర్శించాడు. భరోసా కల్పించారు. ఓ ఎంపీటీసీయే కదా.. నేను వెళ్లాలా..? అనుకోలేదు. వెళ్లాడు. ఓ లీడర్ ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడం అంటే ఇదే కదా.