ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మాతా, శిశు కేంద్రంలో ప్రసవ సేవలు పొంది ఆడబిడ్డకు జన్మనిచ్చిన జిల్లా ఆదనపు కలెక్టర్ స్నేహాలత IAS, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ASP శబరిస్ IPS గారి దంపతులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు.
జిల్లా ఉప పరిపాలన అధికారి అయినప్పటికీ సామాన్యుల లాగా, ప్రజల్లో ఒక్కరిలా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అసేవలు పొంది, ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత గౌరవం పెంచారని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
పేదల గుడి అయిన ప్రభుత్వ ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దరని అన్నారు.
వారి వెంట మేయర్ పునుకొల్లు నీరజ గారు, కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత, AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న గారు, DM&HO మాలతి గారు, సూడా చైర్మన్ విజయ్ గారు, వైద్యులు తదితరులు ఉన్నారు.