ఈట‌ల ఓ బ‌చ్చా… ఇదో పెద్ద ఎన్నిక కాదు.. గెలుపు సునాయ‌సం. కేసీఆర్ అన్న‌మాట‌లు.. అవును ఇది గెలిస్తే మాకు ఒచ్చేదేముంది..? కేంద్రంలో అధికారం వ‌స్త‌దా..? కొడుకు కేటీఆర్ అన్న‌మాట‌లు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో గెలిచేందుకు ఇన్ని శ‌క్తులు ఒడ్డినా.. ఇంకా ఎక్క‌డో ఏదో అనుమానం. ఏ అవ‌కాశం వ‌ద‌లొద్దు. గెలుపు కోసం ఏమైనా చెయ్యాలి. అందుకే మంత్రులంతా ఇక్క‌డే మోహ‌రించారు.

రేపు ద‌స‌రా పండుగ క‌దా.. పాపం మ‌న‌వాళ్ల‌కు పండుగ లేదు ప‌బ్బం లేదు. మొన్న వినాయ‌క‌చ‌వితి కూడా ఇక్క‌డే కానిచ్చేశారు. ఇప్పుడు ద‌స‌రా పండుగ కూడా ఇక్క‌డే ఉండిపోతారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో కాదు.. హుజురాబాద్ ప్ర‌జ‌ల‌తోనే వీరి అల‌య్‌బ‌ల‌య్‌. వ‌చ్చే ద‌స‌రా నాడు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో క‌లస్తారు.. గానీ,.. ఈసారి అంతా హుజ‌రాబాదే.లేస్తే హుజురాబాద్‌. ప‌డుకుంటే హుజురాబాద్‌. అస‌లు ప‌డుకుంటే నిద్ర వ‌స్తే క‌దా. అన్నీ పీడ‌క‌ల‌లు. గెలిచి తీరాలి. ఎవ‌రినీ మిగిల్చొద్దు. అంద‌రినీ లాగెయ్యాలి. ఎమ్మెల్సీల‌ను దించాలి. ఎమ్మెల్యేల‌ను సందు సందుకు పురామాయించాలి. సేమ్ మొన్న‌టి ఎన్నిక‌ల్లాగానే పిల్ల‌ల ముడ్డి కూడా అవ‌స‌ర‌మైతే క‌డ‌గాలి. కొత్త ప‌థ‌కాల‌కు ఎన్ని వేల కోట్లైనా వెనుకాడేది లేదు. ముందు ఇక్క‌డ అమ‌లు చేస్తాం. సక్సెస్‌గా అమ‌లైతే రాష్ట్రం మొత్తం అమ‌లు చేస్తాం. స‌క్సెస్ అంటే టీఆరెస్ అనుకున్నంత భారీ మెజార్టీతో గెలుపు అన్న‌మాట‌. ఒక‌వేళ అదికాలేద‌నుకో.. పైల‌ట్ ప్రాజెక్టు ఫెయిల‌యింద‌ని లెక్క‌. దానికి మ‌న‌మేం చేస్తాం. అంతా ప్ర‌జ‌ల స్వ‌యంకృతాప‌రాదం. ఓటుకు 20వేలిద్దాం. చాల‌క‌పోతే 50వేలిద్దాం. ఎంతిచ్చామ‌నేది కాద‌న్న‌య్యా…. బ్యాలెట్టు దగిందా..? లేదా అన్న‌దే కావాలి.

You missed