డీఎస్ కాంగ్రెస్‌లోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు బలంగా కోరుకుంటున్నారా? మొన్నటి వరకు బీజేపీలోకి వెళ్తాడని భావించి నిరాశపడ్డ కాంగ్రెస్ నాయకులకు.. రేవంత్‌రెడ్డి డీఎస్‌ను కలిసిన తర్వాత ఆశలు చిగురించాయా? ఆయన కాంగ్రెస్‌లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారా?
అవును.. డీఎస్ కాంగ్రెస్‌లోకి రావాలనే కోరుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అదేంటీ..? ఆయననెప్పుడో మరిచిపోయారు కదా జనాలు. ఇప్పుడు ఆయన వచ్చి చేసేదేముంది..? ఏ పార్టలో ఉన్నా ఒరిగేదేముంది..? అని అనుకుంటారు కొందరు. ఎవరి అభిప్రాయాలు వారివి. రేవంత్ .. డీఎస్ అనుభవాన్ని కాంగ్రెస్ బలోపేతానికి వినియోగించుకుందామనుకుంటున్నాడేమో..? ఢీల్లీ పెద్దల ఆశీస్సులు డీఎస్‌కు ఇంకా ఉన్నాయోమో..? కాంగ్రెస్‌తోనే డీఎస్‌కు ఇప్పుడు అత్యవసరం ఏర్పడిందేమో..? ఏమో ఏదైనా కావొచ్చు… కానీ.. డీఎస్ మాత్రం కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. సరే ఇదంతా వదిలేద్దాం.. పైన చెప్పినట్టు.. ఇంతకీ ఎవరు డీఎస్‌ను కాంగ్రెస్‌లోకి రమ్మంటున్నారు. నిజామాబాద్ వాళ్లా..? రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులంతానా? మున్నూరు కాపులా? డీఎస్ అభిమానులా..? ఎవరు..? ఎవరు రావాలనుకుంటున్నారు…? ఎవరు కావాలనుకుంటున్నారు..??
దీనికంత పెద్ద విశ్లేషణైతే నా దగ్గర ప్రస్తుతానికి అందుబాటులో లేదు కానీ. అదే మన అసెంబ్లీలో మన నేతలన్నట్టు.. నేను ప్రిపేరైన రాయడం లేదుకానీ… నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాత్రం డీఎస్ కాంగ్రెస్‌లోకి రావాలని ఘా…ట్టి…గా కోరకుంటున్నారట. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి పేరు మీద రూరల్ కాంగ్రెస్ నాయకులు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. గతంలో భూపతిరెడ్డి రూరల్ నుంచే పోటీ చేసి ఓడిపోయాడు. ఈ గ్రూపులో కొద్ది రోజులుగా ఇదే లొల్లంట. డీఎస్ జిందాబాద్, రావాలి.. రావాలి.. డీఎస్ రావాలి. డీఎస్ అన్న వస్తాడు…. అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారట. ఆయన కోసం ఎదురుచూస్తున్నారంట. మొన్నటి వరకు డీఎస్ నాలుగు గోడలకే పరిమితం. వ్యూహాలన్నీ ఊహలకే అంకింత. రాజకీయ చతురతంతా అజ్ఞాతవాసం వరకే. ఇప్పుడు మళ్లీ డీఎస్ వస్తున్నాడంటే ఇలా…. ఇందూరు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ.
