నిన్నా ఇవాళ్ల చాలా బాధగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా మిత్రులిద్దరు జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్న పాపానికి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.
జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్ల పని పరిధి కారణంగా బలవంతమైన యాజమాన్య సర్పాలను చలిచీమలుగా కూడా ఎదుర్కోలేని దుస్థితిలో కకావికలమైన మిత్రులు ఒక్కొక్కరు కుటుంబాలకు దూరమవుతున్నారు.
వాళ్లకు జోహార్లర్పించి ముందుకు వెళ్లడం మినహా ఏమీ చేయలేని అగమ్యగోచర స్థితి.
జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నందుకు మిగతా కార్మిక వర్గాల వేతనాలను,హక్కులను గురించి వార్తలు రాయడం చేయగలం కానీ ఆయా హక్కులను గురించి స్వతహాగా ఉద్యమించగలిగే స్థితి ఇక్కడలేదు.
యూనియన్లను,నాయకత్వాలను విమర్శించడం ఇప్పుడున్న వాతావరణంలో అభిలషణీయం కాదు. కానీ గ్రామీణ జర్నలిస్టులకు వెట్టి చాకిరీనుంచి విముక్తులను చేయటం కోసం యూనియన్లు ఒక కార్యాచరణ రూపకల్పన చేయాలి. దానికోసం మాత్రం ప్రభుత్వ పెద్దల దగ్గర పరపతి ఉన్న సీనియర్లు కృషి చేయాలి. కార్మిక శాఖ పత్రికలు , మీడియా యాజమాన్యాల తల వంచడం కష్టమైన పని. ఇది యదార్థవాదం. మరి గ్రామీణ పాత్రికేయులకు అండ ఎలా లభించాలి? ఒక ఆచరణాత్మక సొల్యూషన్ లభించకుంటే దశాబ్ధాల తరబడి ఈ ఊబిలో చిక్కుకు పోయిన ఎన్నో కుటుంబాలు మెదక్ మిత్రుడిలా ఇబ్బందుల పాలయ్యే ప్రమాదముంది.
ఆ దిశగా సూచన, కార్యాచరణ కావాలి. లేకుంటే పాతాళగరిగెకు కూడా జర్నలిస్టు జీవితం అందదు….
P V Kondal Rao