నమస్తే తెలంగాణలో ఇప్పుడు కొత్త లొల్లి స్టార్ట్ అయ్యింది. ఎడిటర్ సీటు కోసం నేనంటే నేను అని కొట్లాడుకుంటున్నారు. బ్యూరో చీఫ్ ఓరుగంటి సతీష్ తనకు ఎడిటర్ ఇవ్వాలని కేటీఆర్‌ను కోరాడు. ఇప్పుడున్న కృష్ణమూర్తి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో.. పత్రిక ఎలా భ్రష్టు పట్టిపోయిందో సోదాహరణలతో సహా వివరించి చెప్పడంలో సక్సెసయ్యాడు. ఇవన్నీ చెప్పి.. తనకు ఎడిటర్‌ను చేయాలనే ప్రతిపాదన పెట్టాడు. కానీ అప్పటికే వేగుల ద్వారా సమాచారం తెప్పించుకున్న కేటీఆర్ .. ఓరుగంటిని ఎడిటర్‌ను చేసే ఉద్దేశ్యం లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పేశాడు.
అదే సమయంలో.. ఇప్పుడున్న ఎడిటర్ మీద కూడా అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువలా వెళ్లాయి. సమయం కోసం వేచి చూస్తున్నది అధిష్ఠానం. వీరి గ్రూపు రాజకీయాల్లో పత్రిక పరువు బజారున పడుతున్నది. సీఎం నాకు తెలుసంటే నాకు తెలుసని ఇద్దరూ పోటీలు పడి ప్రచారం చేసుకుంటారు. కేటీఆర్ నాకు దగ్గరంటే నాకు దగ్గర అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కిస్సా కుర్సీ కా అన్నట్టు ఎడిటర్ నువ్వా నేనా అనే రేంజ్‌లో కొట్టుకుంటున్నారు. ఒకరికొకరు గోతులు తవ్వుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు బురద జల్లుకుంటున్నారు.
నెట్‌వర్క్ ఇన్‌చార్జి ఎస్జీవీ శ్రీనివాసరావు ను నిమిత్త మాత్రుడిని చేశారు. ఒకప్పుడు ఈయనా అడిగాడు ఎడిటర్ కావాలని. కానీ కేటీఆర్‌కు ఇష్టం లేదు. ఉన్న పోస్టులోంచి తీసేయాలని వచ్చీ రాగానే ఎడిటర్ విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ వీలు కాలేదు. కోరలన్నీ పీకేశాడు. కనీసం ఓ రిపోర్టర్‌ను తీసేయాలన్నా ఎస్జీవీకి అధికారాలు లేవు. పాపం అలా అయ్యింది పరిస్థితి.