హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ రావు రాజ‌కీయ నాయ‌కుడికంటే ఎక్కువ మాట‌లు చెబుతూ ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాడు. సెప్టెంబ‌ర్‌లో కేసులు పెరుగుతాయ‌ని ఒక‌సారి, అక్టోబ‌ర్‌లో విప‌రీతంగా వ్యాప్తి చెందుతుంద‌ని మ‌రోసారి మాట‌లు చెబుతూ పోయాడు. జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే మా త‌ప్పు ఉండ‌ద‌ని, కొద్ది రోజులు మ‌మ్మ‌ల్ని ఊపిరి పీల్చుకోనివ్వండ‌ని ఏవేవో చెప్పాడు. ఇప్పుడు థర్డ్ వేవ్ లేనేలేదు.. మార్చి వ‌ర‌కు మ‌న‌కు ప్ర‌మాదం లేద‌ని కొత్త సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఐటీ కంపెన‌లు తెర‌వాల‌ని, పిల్ల‌ల‌ను స్కూళ్ల‌కు పంపాల‌ని హిత‌బోధ కూడా చేస్తున్నాడు.

రోజుకో మాట మాట్లాడుతూ ప్ర‌జ‌ల వ‌ద్ద న‌మ్మ‌కం కోల్పోయిన డీహెచ్.. తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌భావం ఎలా ఉంటుందో చెప్ప‌లేం. అయితే జిల్లాల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా చెబుతున్నారు. డీహెచ్ మాట‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. వైర‌స్ ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియ‌ద‌ని చెప్పుకొస్తున్నాడు. ఇప్ప‌టికే జ‌నం భ‌యం లేకుండా, ముందు జాగ్ర‌త్త‌లు లేకుండా తిరుగుతున్నార‌ని డీహెచ్ మాట‌ల‌తో మ‌రింత నిర్ల‌క్ష్యంగా ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నాడు. ఎప్పుడొస్తుందో తెలియ‌ని వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌లు నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందేన‌ని చెబుతున్నారు వైద్యాధికారులు.

You missed