తీన్మార్ మ‌ల్ల‌న్న పాద‌యాత్ర చేస్తున్నాడు… ఓ 20 ల‌క్ష‌లిస్తావా? నీ క‌ల్తీక‌ల్లు వ్యాపార ర‌హ‌స్యాల‌న్నీ బ‌య‌ట‌పెట్ట‌మంటావా?

ఉప్పు సంతోష్ అనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత .. బోధ‌న్ క‌ల్లు కంట్రాక్ట‌ర్ జ‌య‌వ‌ర్ద‌న్ గౌడ్‌ను బెదిరించాడు. మొద‌ట అత‌ను బెద‌ర‌లేదు. ఇ త‌ర గౌండ కుల‌స్తుల‌ను తోడుగా పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. ఏకంగా ఎక్సైజ్ సూప‌రింటెండెంట్‌తో కూడా డ‌బ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పించాడ‌ట‌. ఇక క‌ల్లు వ్యాపారికి త‌ప్ప‌లేదు. దేవుడా..! అంటూ తీన్మార్ మ‌ల్ల‌న్న వ‌ద్ద‌కు వెళ్లి ఓ ఐదు ల‌క్ష‌లిచ్చి కాళ్లు ప‌ట్టుకున్నాడ‌ట‌. ఇక త‌న వ‌ల్ల కాద‌ని. ఈ విష‌యం లేటుగా వెలుగుచూసింది. ఉప్పు సంతోష్‌పై బోధ‌న్‌లో కేసు న‌మోదైంది. బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేసినందుకు 386 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేసి నిన్న రిమాండ్‌కు పంపారు. ఏ1గా ఉప్పు సంతోష్‌ను, ఏ2రాధాకిష‌న్ గౌడ్‌, ఏ3 రాజుగౌడ్‌, ఏ4 సాయాగౌడ్, ఏ5 తీన్మార్ మ‌ల్ల‌న్న పై కేసు న‌మోదు చేశారు. త‌న‌ను ఎవ‌రెవ‌రు ఎలా బెదిరించారో.. ఇందులో ఎవ‌రెవ‌రి ప్ర‌మేయం ఉందో రేపు ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ చెబుతాడ‌ట క‌ల్లువ్యాపారి జ‌య‌వ‌ర్ద‌న్ గౌడ్‌. ఇందులో ఈఎస్ హ‌స్తం కూడా ఉంద‌ని ఆయ‌న చెప్ప‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ఉప్పు సంతోష్ బోధ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించాడు. తెలంగాణ సామాజిక పోరాట స‌మితి పెట్టుకుని దానికి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా చెలామ‌ణి అయ్యాడు.

You missed