ఇందూరు బీజేపీ నేతల వ్యవహారం రచ్చకెక్కుతున్నది. పరాయి స్త్రీల వ్యామోహంలో పడి పదవులు పోగొట్టుకున్న ఉదంతాలు ఇప్పుడు ఇక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల నగరంలోని 45 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల హేమలత భర్త ఆకుల శ్రీనివాస్ ఓ డాక్టర్‌తో జంప్ అయిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ డాక్టర్‌కు గతంలో వివాహం జరిగింది. విడాకులు తీసుకున్నది. ఆకుల శ్రీనివాస్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆమెకు దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఓ రోజు ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ విషయం తెలిసి ఆ డాక్టర్ తండ్రి నాలుగో టౌన్‌లో పిర్యాదు చేశాడు. విషయం రచ్చకెక్కింది. బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ డాక్టర్‌తోనే పిర్యాదును వెనక్కి తీసుకునేలా చేశారు. ఆమె తన ఇష్టపూర్వకంగానే అతనితో వెళ్లినట్లు చెప్పడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు. ఇది ఆ రెండు కుటుంబాల్లో కొత్త చిచ్చును రేపింది.
ఇది మరవకముందే కమ్మర్‌పల్లి మండల బీజేపీ జిల్లా అధ్యక్షుడు నవత్ రంజిత్ కుమార్ ఓ దళిత వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని .. ఆమె భర్త, బంధువులు దేహశుద్ది చేశారు. పోలీసులకు పిర్యాదు చేశారు. అట్రాసిటీ కేసు పెట్టారు. ఆకుల శ్రీనివాస్ పై చర్యల విషయంలో పట్టించుకోని బీజేపీ పెద్దలు.. కమ్మర్‌పల్లి ఇష్యూలో కేసు కాగానే వెంటనే స్పందించారు. అతనితో రాజీనామా పత్రాన్ని రాయించుకుని మీడియాకు రిలీజ్ చేశారు. పార్టీకి దూరంగా ఉంటున్నానని రంజిత్ తెలిపాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత.. పార్టీలో విమర్శలు వచ్చాయి. ఆకుల శ్రీనివాస్‌ను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఓ వర్గం .. నిలదీస్తూ వస్తున్నది. దీంతో అతనికి ఉన్న జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.

రచ్చకెక్కుతున్న బీజేపీ నేతల వ్యవహారం.. అర్వింద్‌కు తలవంపులు…
డాక్టర్‌తో ఇందూరు బీజేపీ కార్పొరేటర్ భర్త జంప్…
వివాహిత మీద కన్నేసిన బీజేపీ నేత… భర్తతో తన్నులు తిన్న వైనం
