తెలంగాణా నేల మీద వరంగల్ కి కనీసం వెయ్యి ఏండ్ల దిక్కర చరిత్ర ఉంది.
ఎంతో నిరసన కవిత్వం వచ్చింది ఇక్కడ . అ కవిత్వానికి ప్రతినిదులుగా ముగ్గురు మహాను బావులు కనిపిస్తారు .
1.పాలకుర్తి సోమన్న
2.బమ్మెర పోతన
3. కాళన్న(కాళోజి)
ఇందులో “నా గొడవ “ప్రకటింప నాంది అయినవాడు – అక్షరాల గోల్కొండ కట్టినవాడు మన కాళోజి కాకా
ఈ రోజు మన కాకా పుట్టిన రోజు నేడు .
“దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం.”
తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని ‘పద్మవిభూషణ్’ కాళోజి నారాయణరావు. రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం రాసి ప్రజాకవి.
“శాస్త్రం పద్ధతి చెపుతుంది
ఆచరణ బ్రతుకు చాటుతుంది
శాస్త్రం ఆదర్శం వల్లె వేస్తుంది
ఆచరణ సాధ్యం నిరూపిస్తుంది”
హక్కులడిగి ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది.హేతువాది .
ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెబుతూ తన అక్షరాయుధాలను సంధించారు.
“మనిషి ఎంత మంచివాడు
చనిపోయిన వాడి చెడును
వెనువెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు
మనిషి ఎంత చెడ్డవాడు
బ్రతికివున్న మనిషిలోని
మంచినెపుడు గుర్తించడు
చెడును వెతికి కెలుకుతాడు”
మొత్తంగా తెలంగాణ జీవిత చలన శీలి కాళోజి. పుటక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు..
KARREMALLI
