నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇక్కడ వాతావరణం అనుకూలమని కూడా తేల్చింది. భూముల సర్వే చేసింది. మొత్తం 1600 ఎకరాలు సేకరికంచాలనుకున్నారు. తర్వాత 1600 ఎకరాలు సేకరించాలనుకున్నారు. ఇందులో 800 ఎకరాలు అసైన్డ్ భూములన్నాయి. మరో 800 ఎకరాలు పట్టాభూములున్నాయి. ఇంకా ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తుందో తెలియదు. ఇస్తే గిస్తే 5 లక్షల నుంచి పది లక్షలలోపే ఇస్తుంది. ఈ విషయం గ్రహించారు రైతులు.
ఇక్కడ ఎప్పుడైతే ఎయిర్ పోర్టు వస్తుందనే ప్రచారం జరిగిందో అప్పటి నుంచి భూములకు రెక్కలు వచ్చారు. ఎకరానికి 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ధర పలుకుతున్నది. సర్కార్ ఎంతిచ్చినా పది లక్షలకు మించి ఇవ్వదు. దీంతో తాజాగా రైతులు మా భూములు ఇవ్వబోమని తిరగబడ్డారు. జక్రాన్‌పల్లి, అర్గుల్, తొర్లికొండ గ్రామాలకు చెందిన రైతుల భూములున్నాయి. వీరంతా స్థానిక తహసీల్దార్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మాకెక్కడా భూములు లేవు. ఉన్న ఈభూములనూ ఇస్తే మా గతేంగాను.. మీమివ్వం.. అని పేర్కొన్నారు.
కానీ అసలు విషయం అది కాదు. సర్కార్ ఇచ్చే అరకొరా పరిహారం మాకు సరిపోదని. మార్కెట్లో అరకోటి వరకు పలుకున్న ధరను దృష్టిలో పెట్టుకుని పరిహారం ఇవ్వాలని. సరే బాగానే ఉంది. కానీ… ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. ఇంకా ఇక్కడ ఎయిర్‌పోర్టు కు సంబంధించిన ఒక్క అడుగూ ముందుకు పడలే. అప్పుడే భూములివ్వమని తిరకాసు మొదలయ్యింది. ఇదింకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.