నాకీమధ్య కాలంలో బాగా చికాకును తెప్పిస్తున్న సమస్య ఎలక్ట్రీషియన్,ప్లంబర్,కార్పెంటర్,తాపీ మేస్త్రి వంటి వృత్తి నిపుణులను హ్యాండిల్ చేయడం.మన ఖర్మ కొద్దీ ఆ వృత్తి లలోని వారిలో నైపుణ్యం శాతం చాల తక్కువ వుంటోంది. ఐనా తప్పదులే అని వారిలో ఎవరినైనా రిపేర్లకని పిలిస్తే తీరికగా పదకొండు గంటలకు వస్తారు.ఓ అరగంట సేపు పని చేసి భోజనానికి అని వెళ్లి మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి కాస్త చీకటి పడేదాకా ఏదో పని కానిచ్చి ఆ తర్వాత వారు అడిగే కూలి అనబడే ఫీజు విన్నాక మనకు కళ్ళు తిరగకపోతే ఒట్టు.ఇక మనకవసరం పడినపుడు వాళ్ళు రావడం అనే రోజులెపుడో పోయి వారికి తీరికగా వున్నప్పుడు మనం చేయించుకోవడమనే రోజులోచ్చాయి. అలాగే కానీలే అని సార్ కి ఎప్పుడు ఆ తీరిక అవుతుందో కనుక్కుందామని పోన్ చేస్తే అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ లేక పోతే నో రెస్పాన్స్.అలా చాలా సార్లు ట్రై చేసిన తరువాత వాళ్ళు దొరుకుతారు.ఆ తర్వాత పైన చెప్పిన స్టోరీ మొత్తం రిపీట్.వీళ్ళ దెబ్బకి జడిసి చాలా మంది వారి కప్ బోర్డ్ లకు హ్యాండిల్స్ గట్రా పోయినా,పెరట్లో గచ్చులు పాడైనా, ఇంట్లో కొద్దిపాటి రిపేర్లు ఏమున్నా, బాగా పోతే చూద్దాంలే అని సరిపెట్టేసుకోవడం పరిపాటయిపోయింది.ఇది ఇలానే కొనసాగితే ఇకనుండీ ఎవడింట్లో రిపేర్లు వాడే చేసుకోవడం నేర్చేసుకోవడం బెటర్ అనుకోండి.

ఇంకో పక్కన పోన్లే సంపాదించుకోనీలే,జీతాలు తీసుకుని లంచాలు ఆశించే వారికంటే వీరు ఎంతో నయం కదా అని
సరిపెట్టుకున్నా నన్ను ఓ డౌట్ వేధిస్తోంది.అదేమిటంటే వీరి
సంపాదన ఎంత బాగున్నా ఆ మాసిన గుడ్డలే వేసుకుని పని లోకి ఎందుకు వస్తారు, కాస్తంత నీట్ గా తయారయి రావచ్చు కదా అని.ఇదే విషయాన్ని నా మిత్రుడికి ఈ రోజు
చెబితే వాడన్నాడు.” పని చేసేటపుడు బట్టలు ఎలానూ పాడవుతాయి అని కొంత,మరీ టిప్ టాప్ గా తయారయి వస్తే వీడు మన దగ్గర బాగానే సంపాదిస్తున్నాడని మనం ఎక్కడ అనుకుంటామనే ముందు జాగ్రత్త ఇంకొంత,అలానే వుంటారులే.పనయ్యి ఇంటికెళ్లిన తరువాత వాడు షికారు
కెళ్లడానికి తయారయినపుడు చూడాలి వాడి డ్రస్సింగ్ ని” అన్నాడు వాడు.

సరే ఏది ఏమయినా, నా ఈ అభిప్రాయం కరెక్టయినా, తప్పయినా, వారందరికీ నాదో చిన్నమాట.” మీరు బాగా సంపాదించండి.ఆనందంగా జీవితాలు గడపండి.కాకపోతే కాస్తంత న్యాయంగా వసూలు చేయండి.ఏ పనినైనా సరే అంకిత భావంతో చేయండి” అని !!!

Raghu Srimanthula

You missed