(దండుగుల శ్రీ‌నివాస్‌)

విచార‌ణ‌ల పేరుతో రేవంత్‌రెడ్డి స‌ర్కార్ సీరియ‌ల్ క‌న్నా ఘోరంగా సాగ‌దీస్తూ వ‌స్తోంది. ఇగో రేపు ఇగో మాపు.. అరెస్టు ఖాయం.. అనేలా ప్ర‌వ‌ర్తిస్తున్న స‌ర్కార్, ఆ త‌రువాత కొద్ది రోజులు ఈ కేసుల‌ను కోల్డ్ స్టోరేజీల్లో పెట్టేస్తుంది. చూసీ చూసీ జ‌నానికి విసుగొచ్చేసింది. మా బాధ‌లు మాకుంటే.. మీ రాజ‌కీయాలు మీకా..? అవినీతి జ‌రిగిందంటున్న‌వు క‌దా.. అరెస్ట్ చేస్తే అయిపోద్ది క‌దా..? జ‌న‌మే కాదు ఈ ముచ్చ‌ట‌ను కాంగ్రెస్ శ్రేణులు కూడా గ‌ట్టిగానే అనుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీలో రేవంతు త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టుకున్నాడు. ఇప్ప‌ట్ల అరెస్టులు లేవు గిర‌స్టులు లేవ‌న్న‌డు.

18Vastavam.in (7)

సినిమాలో విల‌న్‌ల‌ను క్లైమాక్స్‌లోనే క‌దా అరెస్టు చేసేది..? అని హింట్ కూడా ఇచ్చిండు మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ. అంటే ఇంకా మూడేండ్ల పాటు సినిమా ఉంటుంద‌న్న‌మాట‌. అస‌లు ఇది సినిమా కాదు చ‌క్ర‌వాకం క‌న్నా ముదిరిపోయిన జీడిపాకమ‌న్న‌మాట‌. సీఎం మాట‌లు అవే సూచిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు.. అంటే రెండేండ్ల త‌రువాత తాపీగా అరెస్టుల చేస్తార‌ని సీఎం భావ‌న‌. టాకీసుల్లో న‌డిచే సినిమాల్లో విల‌న్ల‌ను క్లైమాక్స్‌లో అరెస్టు చేస్తే ర‌క్తి క‌డుతుందేమో గానీ.. ఇక్క‌డ రేవంత్ సినిమా టాకీసులో అదే ప‌ని చేస్తే మాత్రం అట్ట‌ర్ ఫ్లాప్ అయి కూర్చుంటుంది. జాగ్ర‌త్త‌..!? ఇది నేనంటున్న ముచ్చ‌ట కాదు. మీవోళ్లే. వాళ్ల‌తో పాటు జ‌నం కూడా. జ‌నం ఒక్క‌సారిగా న‌మ్మ‌కం కోల్పోతే ఇక మ‌ళ్లీ న‌మ్మించాలంటే చాల క‌ష్టం సారు. ఇప్ప‌టికే మ‌న ప‌ట్ల జ‌నానికి అంతంత మాత్రంగానే ఉంది గురి. ఇప్పుడు మ‌రింత గ్యాప్ అవ‌స‌ర‌మా..?

Dandugula Srinivas

Senior Journalist

80966451

You missed