(దండుగుల శ్రీ‌నివాస్‌)

కేసీఆర్ స‌ర్కార్‌కు మించి రేవంత్ స‌ర్కార్‌పై రైతాంగం భారీ అంచనాలే పెట్ట‌కున్న‌ది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అలాంటి హామీలు ఇచ్చారు క‌నుక‌. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత .. అప్పులే గుర్తొచ్చాయి. అప్పుల తిప్ప‌లే వ‌ల్లెవేశాడు రేవంత్‌. ఎంపీ ఎన్నిక‌ల‌ప్పుడు మాత్రం అప్పులు గుర్తు రాలేదు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా అప్ప‌డూ హామీలిచ్చాడు. రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీ ఇంకా సంపూర్ణం కాలేదు. ఎక్క‌డ పోయినా రైతులు ఇంకా మిగిలే ఉన్నారు. మేము అర్హుల‌మే కానీ టెక్నిక‌ల్ ఎర్ర‌ర్స్ చూపి మాకు రుణ‌మాఫీ కాకుండా చేశార‌నే ఫిర్యాదులు కోకొల్ల‌లు. కానీ వాటిని ఇప్పుడు స‌ర్కార్ సాల్వ్ చేసేలా లేదు. చేయ‌దు.

ఇక రైతు భ‌రోసా సీజ‌న్‌కు 7,500 నుంచి 6000 కు ప‌డిపోయింది. అదీ రెండు సీజ‌న్లు ఎగ్గొట్టినంక‌. ముచ్చ‌ట‌గా మొన్న మూడెక‌రాల‌కే ప‌రిమితం చేసి మిగిలిన వారిని వ‌దలేశారు. కార‌ణాలు ఎమ్మెల్సీ కోడ్ అని .. ఇంకా ఏదేదో చెప్పి కాల‌యాప‌న చేసి ఆ సీజ‌న్‌కు ఎండ్ కార్డ్ వేశారు. ఇప్పుడు కొత్త‌గా రైతు భ‌రోసాను లాంచ్ చేస్తున్న‌ట్టుగా బిల్డ‌ప్‌. రైతుల‌తో ముఖాముఖి.. ఇప్పుడు 9 రోజుల్లో 9వేల కోట్లంటూ సంబురాలు. మ‌రి పాత బ‌కాయిల మాటేమిటీ రేవంతా..? అని అడుగుతున్నారు రైతులు. మ‌ళ్లీ ప‌దేళ్లూ మేమే అంటున్నావ్‌.. ఎవ‌రు న‌మ్మేది నీ మాట‌లు. గ‌తంలో ఇచ్చిన హామీలు అట‌కెక్కించి … నింద ప‌క్కోడి మీద వేసి కాల‌యాప‌న చేస్తూ వ‌చ్చి.. ఇప్పుడు మ‌ళ్లీ మేమే ప‌దేళ్లు అంటే ఎవ‌రు ఓట్లేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తారు..? అని కూడా నిలదీస్తున్నారు.

రైతు భ‌రోసా సంబురాల‌ని స‌ర్కార్ ఎంత బిల్డ‌ప్ ఇచ్చినా రైతులు మాత్రం ఇంకా గాయాన్ని గెలికిన‌ట్టు స‌లుపుతున్న పాత బ‌కాయిల‌ను గుర్తు చేసుకుంటున్నారు. అదే కేసీఆర్ సీఎంగా ఉంటే.. ఇవ‌న్నీ కార‌ణాలు చెప్పి ఎగ్గొట్టేవాడా..? ఎక్క‌డి నుంచో తెచ్చి ఇచ్చే వాడే క‌దా. మ‌రి నిన్ను సీఎం చేసుకున్నందుకు మాకిదా ప‌నిష్‌మెంట్ అనే చ‌ర్చ గ్రామాల్లో జ‌రుగుతున్న‌ది. పైకి వ్య‌తిరేక‌త పెల్లుబుకిన‌ట్టు క‌నిపించ‌కున్నా.. తీవ్ర ఆగ్ర‌హాలు ప్ర‌ద‌ర్శించ‌కున్నా.. లోలోన కుత‌కుతా ఉడికిపోతున్నారు. స‌మ‌యం కోస‌మే చూస్తున్నారు. ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ఈజ్ బెస్ట్ ఇంప్రెష‌న్ అంటారు. రేవంత్‌పై రైతుల‌కు మొద‌ట్లోనే న‌మ్మ‌కం పోయింది. అది తిరిగి తెచ్చుకోవాలంటే చాలా చాలా క‌ష్ట‌మే.

Dandugula Srinivas

Senior Journalist

8096677451

 

You missed