(దండుగుల శ్రీనివాస్)
అసలే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే. మాకొద్దంటే మాకొద్దని ఆ పార్టీ నేతలే ప్రెస్మీట్లు పెట్టి మొత్తుకుంటున్నారు. మరోవైపు ఓ మీడియా పాత శ్రీరెడ్డి వీడియోను బయటక తీసి లాగి రచ్చరంబోలా చేస్తున్నారు. పార్క్ హయత్ హెటల్‌కు రమ్మన్నాడు.. ఆయన వెనుక కేటీఆర్ ఉన్నాడని ఆయన చెప్పాడని. ఇలా ఏమాత్రం విలువ లేని, నిబద్దత లేని ఓ నేత… కవిత చెప్పినట్టు కేసీఆర్ చుట్టూ దయ్యాలుంటే ఆ లిస్టులో మొదటగా ఉండే వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టాడు. ఓ నలుగురునేసుకుని. ఏమంటాడు..? రేవంత్‌రెడ్డి వి ఏ టూ జడ్ స్కామ్‌లు.. అని వరుసగా ప్రాస, యాస, మూస లో లిస్టు రాసుకుని వచ్చాడు. నవ్వుకునేలా.

బహుశా పెద్దబాసు మెచ్చుకుంటాడని అనుకున్నాడేమో కష్టపడి సేకరించాడు. కాదు కాదు రాసుకొచ్చాడు. లేదా యువరాజు మళ్లీ దగ్గరకు తీస్తాడని అనుకున్నాడో.. తెలియదు కానీ ఇలా ప్రెస్‌మీట్ పెట్టాడు. అచ్చంగా ఇది ఎట్లుందంటే.. కాంగ్రెస్ పెద్దలు.. అదే రేవంత్ అండ్ టీమ్ కాళేశ్వరం మీద చేస్తున్న అవినీతి ఆరోపణలాగే. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింటున్నారు కదా.. దాని నిర్మాణానికే లక్ష కోట్లు కాలేదురా బై.. ఇంకా ఏడ లక్ష కోట్లు తిన్నరు.. అని అంతా నువ్వుకుంటున్నా.. మనోళ్లు చెప్పేది చెప్పుకుంటున్నారు.
మొత్తానికి ఆ ప్రాజెక్టును అంతా కలిసి రాజకీయం చేసి ప్రజాధనం దుబ్బలో పోసి దుర్వినియోగం చేసి రాజకీయాలకు వాడుకుని, అవినీతి ఆరోపణలతో ముంచేసి జనం చెవిలో ఒకరికి మించి మరొకరు పువ్వు పెట్టి … ఇక చాలు గానీ.. ఏ టూ జడ్ స్కామ్‌లను అద్బుతంగా బయటకు లాగిన ఏవన్రెడ్డిని రేపు సర్కార్ వచ్చిన తరువాత ఘనంగా సత్కరించాలె సారు. మర్వకుండా.
