క‌రోనా వ‌ల్ ప్రైవేటు స్కూళ్లు చాలా వ‌ర‌కు మూత ప‌డ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20వేల వ‌ర‌కు మూత‌ప‌డ్డాయ‌ని చెబుతున్నారు. సెప్టెంబ‌ర్ 1 నుంచి కేజీ టు పీజీ విద్యా సంస్థ‌ల‌న్నీ తెర‌వాల‌ని ప్ర‌భుత్వం భావించిన నేప‌థ్యంలో.. ప్రైవేటు యాజ‌మాన్యాలు మాత్రం కోలుకోలేకుండానే ఉన్నాయి. ప్ర‌భుత్వం విద్యా సంస్థ‌లు తెర‌వాల‌ని నిర్ణయం తీసుకున్నా.. ఎందుకో మేనేజ్‌మెంట్ అంత హ్యాపీగా లేదు. ఓ వైపు థ‌ర్డ్ వేవ్ క‌రోనా అంటున్నారు. ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌ద‌ని భ‌య‌పెడుతున్నారు. వ‌స్తే అది సీరియ‌స్‌గా ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈసారి పిల్ల‌ల‌ను వ‌ద‌ల‌ద‌ని కూడా చెబుతున్నారు. ఇన్ని భ‌యాల మ‌ధ్య‌.. ఈ పాఠ‌శాల‌లు తెరిచినా.. మ‌ళ్లీ ఎప్పుడు బంద్ చేయ‌మంటారోన‌నే భుగులు మాత్రం వారిని వెంటాడుతున్న‌ది. అన్ని ఖ‌ర్చుల భ‌రించి.. క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి బ‌డులు తెరిచినా అవి ఎన్ని రోజులు కొన‌సాగుతాయో తెలియ‌ని అయోమ‌య‌, గంద‌ర‌గోళ ప‌రిస్థితులున్నాయి. మీడియాలో వ‌స్తున్న థ‌ర్డ్ వేవ్ క‌థ‌నాలు కూడా స్కూల్ మేనేజ్‌మెంట్‌ను భ‌య‌పెడుతున్నాయి. త‌ల్లిదండ్ర‌లూ క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. అంతా రెడీ చేసుకుని ఇక సిద్ధం అని ముందుకు పోతున్న త‌రుణంలో గ‌వ‌ర్న‌మెంటు మ‌ళ్లీ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో…? ఈసారీ ఇదే జ‌రిగితే ఇక లేవ‌డం క‌ష్టం…