ఈ ఫోటోలో చేతులు కట్టుకుని వినమ్రంగా కూర్చున్న ఇతనెవరో తెలుసా డియర్ ఫ్రెండ్స్..?

ఇతనెవరో కాదు ” ఈ మధ్య సోషల్ మీడియాలో సంచలనాలు రేపుతూ ట్రెండింగ్ లో ఉన్న బుల్లెట్ బండి పాట రచయిత లక్ష్మణ్….

ఎస్ !!..ఎంతో సాధారణంగా కనిపించే ఈయనలో అద్వితీయమైన గేయ రచనా ప్రతిభ ఉంది…

మహభూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా) లోని షాద్ నగర్ డివిజన్ లోని నిర్దవెల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాడు…

చిన్నప్పటి నుండీ సినిమాలన్నా, పాటలన్నా ఎంతో మక్కువ పెంచుకున్న ఈ మట్టిలో మాణిక్యానికి గేయ రచన అంటే ఎంతో ఇష్టం, మక్కువ అని చెప్పాడు…

లక్ష్మణ్ కు ఒక కవల సోదరుడు రామ్ (అన్న) ఉన్నాడు అతను కూడా మంచి గాయకుడు….

యూట్యూబ్ లో లక్ష్మణ్ రాయగా ఇతని అన్న పాడిన పాటలు చాలా మందిని ఆకట్టుకుని వీరికి యూ ట్యూబ్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టాయి కూడా….

చిన్నప్పటి నుండీ స్కూల్లో అన్నదమ్ములిద్దరూ పోటీలు పడి, పాటలు పాడి ఎన్నో ప్రైజులు సొంతం చేసుకున్నారట…

లక్ష్మణ్ కు ఆరాధ్య రచయిత సినీ గేయ రచయిత చంద్రబోస్….ఇంకా అనంత శ్రీరామ్, మిట్టపల్లి సురేందర్, మాట్ల తిరుపతి ల గేయ రచనా అన్నా తనకెంతో ఇష్టం అట…

ఈ బుల్లెట్ బండి పాట పుట్టుక నేపథ్యం…

ఈయన రాసిన పాటలు యూ ట్యూబ్ లో అప్పటికే చాలా మందిని ఆకర్షించడం వల్ల ఒకసారి బుల్లెట్ బండి పాటకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన ఎస్.కె. బాజీ సినీ నేపథ్య గాయని మోహనా భోగరాజు కు ఈయన గురించి, ఈయన రాసిన పాటల గురించి చెప్పాడట….

తర్వాత ఒక రోజు మోహనా భోగరాజు లక్ష్మణ్ కు కాల్ చేసి, తనను పరిచయం చేసుకుని, “మనం ఒక ప్రైవేట్ ఆల్భం పాట చేద్దాము ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని అంశంతో కూడిన, అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఉండే ఒక మంచి జానపద గీతం రాయాలని చెప్పిందట”…

బాహుబలి లాంటి పెద్ద సినిమాకు పాడిన సింగర్ తనకు ఫోన్ చేసి పాట అడిగే సరికి ఉబ్బి తబ్బిబ్బైన లక్ష్మణ్ దాన్ని ఒక గొప్ప అవకాశంగా భావించి, ఒక అద్భుతమైన పాట రాయాలని సంకల్పించి, బుల్లెట్ బండి పాట రాయడం జరిగిందట…

బుల్లెట్ బండి పాట రాయడానికి ఆయనకు 22 రోజుల సమయం పట్టిందని చెప్పాడు…

పూర్వం… అంటే రెండు మూడు దశాబ్దాల క్రితం పల్లెల్లో ఆడపచుల కట్టూ, బొట్టూ, అప్పటి అమ్మాయిలు తన కాబోయే వరుడి గురించి కనే కలలు, ఆమె పుట్టింటి నేపథ్యం, అత్తారింట్లో తను అడుగు పెట్టాక తను ఎలా మసలుకోవాలనుకుంటుందో అనే ఇతి వృత్తాలతో తెలంగాణ ప్రాంతంలో సహజంగా ఉచ్చరించే, ఇదివరకెన్నడూ, ఎవరూ వాడని తెలంగాణ పల్లె పదాలైన ” ఉల్లో” “పా” (పద) వెట్టుకున్న, జుట్టుకున్న లాంటి సాధారణ పదాలతో ఒక అసాధారణమైన, అందరినీ ఆకట్టుకుని, పాటల జగత్తులో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా “బుల్లెట్ బండి” పాట రాసాడు లక్ష్మణ్….

ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన ఇతర సాంకేతిక నిపుణులకూ అభినందనలు తెలియజేస్తూ.

(ఈ పాటకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన ఎస్.కె. బాజీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.)

….షేక్ చాంద్

You missed