మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘సలార్’ పై మార్కెట్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. భారీ బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హిరోయిన్‌గా నటిస్తున్న సలార్ మూవీ హైదరాబాద్‌లోని నగర శివారులోని దండు మైలారం వద్ద రెగ్యులర్ |షూటింగ్ జరుపుకుంటున్నది. దాదాపు సగం సినిమా పూర్తి చేసినట్లు తెలిసింది.
‘కేజీఎఫ్’ సినిమా భారీ విజయంతో అందరికీ పరిచయమైన ‘ప్రశాంత్ నీల్’ ఈ సినిమాకు కథ రాసి డైరెక్టన్ చేస్తున్నాడు. వచ్చే యేడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. సుజీత్ డైరెక్షన్‌లో వచ్చిన ‘సాహో’ సినిమా పై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. దీని తర్వాత ప్రభాస్ సలార్ మీదే నమ్మకం పెట్టుకున్నాడు.

ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ -2’ కూడా పూర్తయిపోయింది. కరోనా నేపథ్యంలో దీని విడుదలను వాయిదా వేసినట్లు తెలిసింది. కాగా సలార్‌లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. తండ్రి ఆర్మీలో అధికారిగా, కొడుకుగా మెకానిక్ పాత్రలో ప్రభాస్ నడిస్తున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఇందులో విలన్‌గా జగపతి బాబు ‘రాజమనార్’ పాత్రలో తన విశ్వరూపం చూపనున్నాడు. ప్రభాస్ కన్నా జగపతి బాబు స్టిల్లే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
