నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల పరిధిలోని ఆరెపల్లి గ్రామ సర్పంచ్ మల్లేష్… పంచాయతీలకు నిధులు లేక.. పెట్టిన డబ్బులకు బిల్లుల రాక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటున్నారు. ఈ విషయం మీడయాలో రావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. దీనిపై జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి హుటాహుటిన స్పందించి వెంటనే డీపీవోతో ఓ ప్రెస్‌నోట్ విడుదల చేయించాడు. నిధులు వచ్చాయని, అతని ఆర్థిక , మానసిక పరిస్థితి బాగాలేక సెక్యూరిటీ గార్డుగా చేసుకుంటున్నాడని సమస్యను తమ భుజాల మీద నుంచి దించేసుకున్నారు. ఈ విషయం తెలిసిన జిల్లాలోని మిగిలిన సర్పంచులంతా ఈ రోజు మల్లేశ్ వద్దకు వచ్చారు. మద్దతుగా నిలిచారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సిద్దమయ్యారు.