బండి సంజ‌య్ పై మైనంప‌ల్లి హ‌న్ముంతురావు బూతుల‌తో విరుచుకుప‌డ‌డం మ‌న‌వాళ్ల‌కు ఎంతో న‌చ్చింది. చెవుల‌కు ప‌ట్టిన తుప్పు వ‌దిలి పోయింది. వీనుల విందుగా, ఆనంద ప‌రవశంలో తేలియాడారు. ఇన్ని రోజులు ఈ విధంగా బూతులు తిట్టే నాయ‌కుడు, ఇంత ధైర్యంగా తిట్ల పురాణం అందుకున్న నాయ‌కుడు మ‌న వాళ్ల‌కు తార‌స‌ప‌డ‌లేదు. ఎన్నో రోజులకు ‘మైనంప‌ల్లి’ రూపంలో పార్టీని ఆదుకునే ఆప‌ద్భాంద‌వుడిలా ద‌ర్శ‌న‌మిచ్చాడు. ‘బండి సంజ‌య్‌ను ఎదుర్కొనే మొన‌గాడే మన పార్టీలో లేడా?’ అని చింతిస్తూ , దిగులు ప‌డుతూ ..ఆందోళ‌న చెందుతున్న త‌రుణంలో మైనంప‌ల్లి మ‌న వాళ్ల‌కు ‘మ‌గ‌ధీరుడి’లా క‌నిపించాడు.

త‌న‌ను తాను మ‌రిచిపోయి ఓ గ‌ల్లీ లీడ‌ర్‌లా.. ప‌క్కా రౌడీ షీట‌ర్‌లా మ‌న బండి సంజ‌య్‌ను మించిపోయి.. పాతాళంలోకి దిగ‌జారిపోయి… ఆ మాట్లాడే మాట తీరే మాకిప్పుడు కావాలి. ఇలాంటి లీడ‌రే మ‌న పార్టీకి ‘ర‌థ‌సార‌థి’లా ఉండాలి. అందుకే మైనంప‌ల్లికి ‘పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్’ ఇస్తే బండి సంజయ్ గుండు మీద రోజు బండ బూతులా బండ‌లెత్తేస్తాడు. బీజేపీని పాతాళంలోకి తొక్కేస్తాడు. ఇక మ‌న‌కు తిరుగే ఉండ‌దు. ప‌నిలో ప‌నిగా మ‌న నేత‌లంద‌రికీ ఈ బూతులు ఎలా తిట్టాలో ట్రైనింగ్ కూడా మైనంపల్లి తో ఇప్పియ్యాలి. క్యాబినెట్‌లో అవ‌కాశం కూడా క‌ల్పించాలి. ఇలాంటి నేత మ‌రుగున ప‌డ‌డానికి వీలులేదు. మైనంప‌ల్లి వాగ్దాటిని వాడుకుని పార్టీకి ప్రాణం పోయాల‌ని మేమంతా పెద్ద సారును ముక్త‌కంఠంతో కోరుతున్నాము.

ఇట్లు..
టీఆరెస్ శ్రేణులు