(వాస్తవం ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్)
హైదరాబాద్‌కు సమాంతరంగా, అంతే వేగంగా ఇప్పుడు ఈ నాలుగు నగరాలు ఎదగనున్నాయి. అభివృద్ధి అంటే హైదరాబాద్, బతుకుదెరువు అంటే హైదరాబాద్, వ్యాపారం అంటే హైదరాబాద్.. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని అనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవును.. ఓ వైపు హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తూనే, పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ లక్షల కోట్ల పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రపంచం దృష్టిని తెలంగాణ తనవైపునకు తిప్పుకునేలా చేసిన సర్కార్ చర్యలు.. ఇప్పుడు మరో ముందడుగు వేస్తున్నది. ఒక్క హైదరాబాదే కాదు.. సమాంతరంగా పట్టణాలనూ అందులోనూ కీలక నగరాలనూ అదే స్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా విద్యా, ఉపాధి మార్గాలను మెరుగుపర్చడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిందే బృహత్ ప్రణాళికను ఆచరించి అమలు చేసేందుకు సర్కార్ సమాయత్తమైంది. తెలంగాణ ఇలా అన్ని విధాల అభివృద్ధి పర్చాలనే సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ప్రపంచమే ఆశ్చర్యంతో మనల్ని చూసే పరిస్థితికి వచ్చినం. 2047లో భారత్‌కి 100 ఏళ్లు నిండితే, తెలంగాణ 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందని సర్కార్ గట్టిగా భావిస్తోంది. సీఎం చర్యలతో హైదరాబాద్ మాత్రమే కాదు – ప్రతి గ్రామం, ప్రతి చిన్న పట్టణం కూడా మెరిసిపోతాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం – అంతటా కొత్త ఫ్యాక్టరీలు, కాలేజీలు, ఆస్పత్రులు, ఆట స్టేడియమ్‌లు వస్తాయి.
రేవంత్ భవిష్యత్ ప్రణాళిక చాల గొప్పది. పెద్దది. ప్రతి యువకుడికి ఉద్యోగం, ప్రతి పిల్లవాడికి మంచి స్కూలు, ప్రతి కుటుంబానికి శుభ్రమైన గాలి, ఆకుపచ్చ చెట్లు, మన పిల్లలు ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకునేలా స్టేడియమ్‌లు – ఇవన్నీ ఆయన సంకల్పంలో ఉన్న కీలక అంశాలు. అభివృద్ధి, పేదవాడి సంక్షేమం – రెండూ ప్రభుత్వానికి రెండు కళ్లలా కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీని, అన్ని పార్టీల నాయకుల్ని ఆయన కీలకమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించారు.
“రాజకీయాలు పక్కన పెట్టి, తెలంగాణని కలిసి ఐక్యంగా అభివృద్ధి చేద్దాం… కలిసి నడుద్దాం.. అనేది ఆయన నినాదంగా, అభిమతంగా కొనసాగుతోంది. ఇదే రేవంత్ రెడ్డికున్న ప్రత్యేకత. అందరినీ జత చేసే నాయకుడాయన అని పేరు గడించాడు. ఈ ఐక్యత వల్ల అమెరికా, జపాన్, జర్మనీ కంపెనీలు “చైనా ఒక్కటే కాదు, తెలంగాణ కూడా కావాలి” అంటున్నాయి. దీన్నే చైనా+1 అంటారు. తెలంగాణ దేశానికే దారి చూపిస్తోంది.
హైదరాబాద్ త్వరలో ప్రపంచంలోనే అతి సంతోషం, అతి పచ్చదనం, అతి తెలివైన నగరంగా మారబోతోంది. తెలంగాణ దేశానికి చూపించబోతోంది. ఇదే ఈ సర్కార్ ధ్యేయంగా ఉంది.
