వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది అని మంత్రి సీతక్క ఆరోపించారు. కేటీఆర్ కు అధికారం పోయాక పిచ్చోడు అయిపోయాడని ఆమె మండిపడ్డారు. శుక్రవారం నాడిక్కడ ఆమె మాట్లాడుతూ.. చెల్లి కవిత రేపో మాపో రాజీనామా చేస్తదని తెలుస్తుందని అన్నారు. కమిషన్లకి కక్కుర్తి పడ్డది కేటీఆర్.. బీఆర్ఎస్ కమిషన్ల ప్రభుత్వం అన్నారు. కన్నీళ్లు తుడిచే ప్రభుత్వం మాది అని ఆమె అన్నారు. ఇక, సుందరిమణుల్లో ఒకరికో ఒక్క అమ్మాయి అలా చేస్తే దాన్ని ప్రభుత్వానికి అంట గట్టడం అవివేకం, దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్ అబద్ధాలు చెప్పి కాలం వెల్లదిస్తున్నారు..గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో భూములు మారిపోయాయని మంత్రి సీతక్క ఆరోపించారు.
అయితే, ధరణిలో మోఖ విూద ఉన్న రైతులకు కాకుండా వేరే వాళ్ళకి భూములు పట్టాలు చేశారని సీతక్క అన్నారు. భూమి న్యాయంగా ఎవ్వరికి దక్కాలో వారికే దక్కేందుకు తీసుకొచ్చిందే భూ భారతి లక్ష్యం.. భూ స్వాములకు తిరిగి భూములు తీసుకోవడం కోసం ధరణి పని చేసింది.. జూన్ 2వ తేదీ నుంచి రైతుల కనీళ్లు తుడిచేది భూ భారతి అమలు చేస్తున్నాం.. ఇక, రాజకీయ జోక్యం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలు.. ఐటిడిఎల పరిధిలో ఉన్న వాళ్ళకు స్పెషల్ గా ఇండ్లు ఇస్తాం.. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే ఇందిరమ్మ ఇండ్లు.. ప్రజా ప్రతినిధులు అర్హత లేని వారు ఉంటే చెప్పండి తొలగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మంత్రి అన్నారు. ఈ లిస్టులో రాకపోతే తరువాత వచ్చే లిస్టులో ఉంటదని మంత్రి సీతక్క వెల్లడిరచింది. ఇక, భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా రెండో విడత పెంచికల్ పెట్ లో నిర్వహించడం జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. 12 ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న చిక్కు ముడులను తీయడానికి భూ భారతి చట్టం తీసుకొచ్చాం.. కాస్తూ కాలం తీసేయడంతో రైతులు ఆత్మహత్యలు, అధికారులపై దాడులు జరిగాయి.. కేసీఆర్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాహుల్ గాంధీ కూడా ధరణిని తీసేస్తామని అన్నారు.. రైతు హక్కులు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు..
పోడు చేస్తున్న రైతులకు గిరి వికాసం క్రింద సోలార్ ను అందించి భూమి సస్యశ్యామలం చేయాలని కోరారు.. ప్రతి నియోజకవర్గంలో3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.. ఐటిడిఎ నుంచి కూడా ఆదివాసులకు అందించేందుకు చర్యలు చేపట్టాం.. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు రైతులకు సహకరించాలి, ఎలాటి ఇబ్బందులు పె-ª`టటొ-దని పేర్కొన్నారు. కొత్త అడవిని కొట్టవద్దు. దాని కోసం అవగాహన కల్పిస్తామని సీతక్క చెప్పుకొచ్చారు.