(దండుగుల శ్రీనివాస్)
తెలంగాణ ప్రజలు వెర్రి వాజమ్మలను చేశారు ఇద్దరు. ఒకరు కేసీఆర్. ఇంకొకరు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ చేసిన ఆర్థిక అరాచకం ఇప్పట్లో తెలంగాణను కోలుకోనివ్విదు. అది అర్ధమవుతూనే ఉంది. అది అర్థమైనా అధికారం దక్కించుకోవడమే యావగా, లక్ష్యంగా అలవిమాలిన హామీలిచ్చాడు రేవంత్. అధికారం రావడమే పరామావధిగా పెట్టుకున్నాడు. వచ్చిన తరువాత చూసుకుందాం లే అనుకున్నాడు. వంద అబద్దాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. వెయ్యి హామీలిచ్చైనా ఎన్నికల్లో నిలబడాలి. గెలవాలి. అదే చేశాడు రేవంత్. కేసీఆర్ చేసిన అప్పులు మామాలువి కాదు. పెరిగి కొండంతైనవి. మరోసారి అధికారంలోకి వస్తే మనకు తెలియకుండానే మన ముడ్డిబట్ట కూడా మాయం అయ్యే రేంజ్ అది. మరి రేవంత్ ఏమన్నా తక్కువ తిన్నాడా..? ఉచితాలు పేలాల్లా చల్లాడు. గాలిలో అవన్నీ ఎగిరి ఓటర్ల కళ్లకు ఏది నిజం..? ఎవడు నిజాయితీ పరుడు..? అని తెలుసుకోలేని పొరలు కమ్మేలా చేశాయి.
పూర్తిగా పాతాళంలోకి కూరుకుపోయేలా చేశాయి. ఇప్పుడు నన్ను కోసినా ఏం చేయాలేనంటున్నాడు రేవంత్. మరి మ్యానిఫెస్టో సంగతేంటి…? జనం దేన్ని నమ్మాలి..? ఎవరు మాటలు విశ్వసించాలి. యూపీఏ రాకపోవడమూ ఓ శాపంగా అనుకుంటున్నాడా..? రేవంతు. అది తెలంగాణ జనానికేం సంబంధం…? ఏ రాష్ట్ర సీఎం కూడా ఇంతటి దౌర్బాగ్య స్పీచ్ ఇచ్చి ఉండడు. అంతలా మనం అందరి ముందు పలుచనయ్యాం. కారకులెవరు..? ఒకరు కేసీఆర్. ఇంకొకరు రేవంత్. అన్నీ తనకే తెలుసంటాడు.జాతి పితగా తనను కీర్తించాలంటాడు. దేశాన్ని ఏలే రాజు తనేనని కలలు కంటాడు. కలరింగిస్తాడు. జనాన్ని వెర్రి వెంగళ్లప్పలను చేస్తాడు.
నాయకుడు మారిండు. పాలకుడు మారిండు. పార్టీ మారింది. కానీ విధానాలు మారలే. మోసం చేసే పద్దతి మారలే. జనాన్ని నాయకులు చూసే దృష్టి కోణమూ మారలే. జనం పాలకుల దృష్టిలో వెర్రి గొర్రెలు. మ్యానిఫెస్టో మాకు ఓ భగవద్గీతంటాడు ఒకడు. ఖురాన్ తో సమానం అని శపథం చేస్తాడు ఇంకొకడు. బైబిలంత పవిత్రమైనదని చెవి కోసిన గెర్రెలా అరుస్తాడు ఇంకొకడు.అందరూ కలిసి ఇదే పాటందుకుంటారు కోరసగా. అధికారం వచ్చినంక. ఇగో ఇట్లనే ఉంటది నన్ను కోసినా… కోసుకుని తింటారా..?
తీరా ఎన్నికల సమయం వచ్చేనాటికి మళ్లీ అవే తోడెళ్లు మ్యానిఫెస్టో గొర్రె తోలు కప్పుకుని మేం ఇది చేస్తామంటే.. మేం ఇంత చేస్తమంటారు. హైదరాబాద్‌లో సముద్రం తెప్పిస్తామని కూడా అంటారు ఏదో సినిమాలో చెప్పినట్టు. అందుకే అధ్యక్షా…! ఇకపై మ్యానిఫెస్టోలో తప్పనిసరిగా ఇవన్నీ హామీలు నన్ను కోసినా అమలు చేసి తీరుతా అని ఆన చేసేలా కండిషన్ పెట్టాలి. అంతే.
పెట్టినా చేయకపోతే… ఏం చేస్తాం.. అధ్యక్ష మా గొర్రెలకు అది అలవాటే. మళ్లీ కొత్త తోడేలు కోసం చూస్తాం.
