(దండుగుల శ్రీనివాస్)
లోబడ్జెట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రచారమూ బాగుంది. గతంలో ప్రవేశపెట్టిన పథకాలకు ఇంతలా ప్రచారం దొరకలేదు. సన్నబియ్యం పథకంపై జనాలు ఆసక్తి చూపారు. సర్కార్‌కు ఇది పెద్ద భారమైన పథకం కాదు. కానీ పేదోడికి చాలా దగ్గరైన పథకం. అందుకే అక్కున చేర్చుకున్నారు. అదుర్స్ అన్నారు. లీడర్లు కూడా వారి ఇళ్లకు భోజనాలకు వెళ్లారు. కలిసి తిన్నారు. ఇది బాగా క్లిక్ అయ్యింది. దొడ్డు బియ్యం తినలేక అమ్ముకునే పరిస్థితి. బయట సన్నబియ్యం కోసం కిలోకు యాభై రూపాయలు పెట్టాల్సిన దుస్థితి. ఇదో భారమైన బడ్జెట్ పేదల కుటుంబాల్లో. అందరూ సన్నబియ్యం తినడానికే అలవాటు పడ్డారు.
తప్పనిసరి పరిస్థితుల్లో అవి భారమైన బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడా పరిస్థితి లేదు. జనం నాడి తెలుసుకుని ప్రవేశపెట్టిన పథకాల్లో ఇదీ ఒక్కటి. అందుకే తొందరగా క్లిక్ అయ్యింది. అయితే మిగిలిన పథకాలు జనం మెచ్చినవి కావా..? కానీ అవి అమలులో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలె. జనాలందరికీ చేరువ కాలె. ఈ పథకం అయ్యింది. రేషన్‌కార్డులు ఇవ్వలేరనే బాధ తప్పితే .. ఇప్పుడున్నవారికి సన్నబియ్యం వస్తున్నాయి. అవే తింటున్నారు. .ఇక అమ్ముకునే దుస్థితి లేదు. సర్కార్ ఏర్పడిన తరువాత ఏడాదిన్నర కాలంగా సీఎంకు పాలాభిషేకాలు చేసింది లేదు. ఆ లెవల్లో ప్రచారం చేసిందీ లేదు. కానీ ఈ పథకం ద్వారా పాలాభిషేకాల ట్రెండ్ కూడా స్టార్ట్ అయ్యింది.