(దండుగుల శ్రీనివాస్)
ఎంతెంత దూరం ఇంకెంత దూరం..అని అడిగినట్టే ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ కి మొన్న పోయివచ్చినంక లీకులిచ్చిండ్రు. ఈనెల 3న ముహూర్తమని పక్కా విస్తరణ అయిపోతుందని, ఇగో వీళ్లు వీళ్లు మంత్రులవుతున్నారని. కానీ మళ్లీ అదే సినిమా చూపిచ్చిండ్రు ఢిల్లీ పెద్దలు. ఇక్కడి నుంచి అందరినీ రమ్మన్నరు. విస్తరణలో ఎవరెవరికి ఇస్తే మంచిది….? ఎవరి కులాలేంటివి..? కేబినెట్‌లో ఏ కులాలకు తక్కువ వడ్డయి… ఎవరెవరు లైన్లో ఉండి గట్టిగా ట్రై చేస్తున్నరు….. ? ఇవన్నీ ముచ్చట్లు అడిగిండ్రు. పంపిండ్రు. ఇక నాకంటే నాకు… రేపంటే రేపే అని ఇక్కడ ఆశ వడ్డ లీడర్లంతా సంకలు గుద్దుకున్నరు.
రాజగోపాలైతే నాకు హోం మంత్రి పదవంటే చానా ఇష్టమని కూడా చెప్పేసిండు. ఆలి లేదు చూలు లేదు గానీ ఆయనకు హోంమంత్రి కావాలంట. సరే, ఇప్పుడు చెప్పొచ్చే ముచ్చటేందంటే, మొన్న ఉగాదికి సీఎం సారు పోయి గవర్నర్‌ను కలిసిండు. ఇగ అంతా మంత్రివర్గ విస్తరణ ఖరారైంది. మూడో తారీఖున అంటూ చెప్పుకున్నరు. మీడియా అయితే డేట్ పెట్టుకుని మరీ మొదటి పేజీల వార్తలు కుమ్మేసింది. కానీ మూడో తారీఖు పోయింది. పదో తారీఖు వస్తుంది. కానీ ఇంకా ఊసులేదు. ముచ్చట లేదు. ఎప్పుడంట మరీ..? అని ఒకల్లొదకలు అడుగుకుంటుండ్రు. ఏమో నాకు తెల్వదు…? ఆ ఒక్కటి అడక్కు అనే సమాధానమే వస్తుందట ఢిల్లీ నుంచి గల్లీ నుంచి.
ఒక్క వాకిటి శ్రీహరి ముదిరాజ్ తప్పితే ఎవరి పేరు కూడా ఇప్పటికీ క్లారిటీ రాలే. రాములమ్మ నాకు మంత్రి పదవి ఖాయమంటున్నది. హోం మంత్రినైతా అని కూడా కలలు కంటున్నది. వీ6 వివేకు సారు ఎస్సీ కోటాలో నాది కన్ఫాం అని ధీమాగా ఉన్నడు. ఇద్దరు రెడ్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి మాకు పక్కా అని డిసైడ్ అయ్యిండ్రు. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కడు లేడు మంత్రి నాకెట్లియ్యరు..? ఇయ్యకపోతే రాజీనామా చేస్త అని బెదిరిస్తుండు మల్రెడ్డి రంగారెడ్డి. ఇలా నడుస్తుంది కాంగ్రెస్ రాజకీయం. ఎవరి సమస్యలు వాళ్లకున్నయి. అదెప్పుడైతుంది వారికే తెల్వదు. సీఎం విదేశీ టూర్ ఉంది. ఆయన ఒచ్చినంకనన్నా క్లారిటీ వస్తదా..? ఆ ఒక్కటి అడక్కు.