(Dandugula Srinivas)
అప్పుడు పట్టించుకోలె. సారు కోసం తండ్లాడినం. కొట్లాడినం. పాణాలమీదకు తెచ్చుకున్నం. తెలంగాణొచ్చింది. మన బతుకులు బాగుపడతయి అనుకున్నం. పదేండ్లు గడిచినా బతుకులు మారాలె. మరింత రోడ్డుపాలైనయ్. అప్పులు గుండెల మీద కుంపట్లయినయ్. అయినా .. మీరు సల్లంగుండాలె.. హాయిగుండాలె…! అనే అనుకున్నం. పెండ్లాం పిల్లలు తిట్టినా సారును ఇడవలే. పిల్లల బతుకులకు భరోసా లేకున్నా సారు బాగుండాలె అనే అనుకున్నం. అధికారంలో ఉన్నప్పుడు ఇయ్యాల గాకపోతే రేపైనా ఏదైనా చేస్తడేమోనని కళ్లకు కాయలు కాసేటట్టు ఎదురుచూసినం. పదవుల్లేకపాయె. మరియాదా రోజు రోజుకు దిగజారి పాయె. కల్వనీకే కూడా గగనమైపాయె. అయినా.. సారు సల్లంగుండాలె. మీరు హాయిగుండాలె. అనే అనుకున్నం. ఇగో గిసుంటే కాలం వచ్చినప్పుడైనా కాలం చేయకుండా కాపాడినందుకు… మీకు చేతులెత్తి దండం పెట్టాలె.
ఆ గాంధీ నెహ్రూ పక్కన నీ బొమ్మ ఉండాలె…. పోలీసు స్టేషన్లల్లా మా ఫోటోలుండాలె…
మీరు సల్లంగండాలె…. బాబు హాయిగుండాలె….!
ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఖమ్మం టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, అలాగే సోషల్ మీడియా వేదికగా “కేసీఆర్ సందేశ్” పేరిట పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకుపోతున్న డోకుపర్తి సుబ్బారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధినేత కేసీఆర్ గారు, అతన్ని ఎర్రవెల్లి నివాసానికి ఆహ్వానించి, ఆరోగ్య పరిస్థితిని వివరంగా అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షల చెక్కును సుబ్బారావుకు స్వయంగా అందజేశారు. తనను ఆపదలో ఆదుకున్న పార్టీ అధినేతకు సుబ్బారావు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
https://youtu.be/n1oXxijA0xA?si=RIKHs6GI7deFSGad