(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప‌దేళ్ల‌లో మ‌న‌కు రేష‌న్‌కార్డులెందుకు ప్రింట్ కాలేదు. గ‌తంలో కార్డులు వాటికి లామినేష‌న్‌లు.. దాంట్లో ఫ్యామిలీ ఫోటోలు ఉండేవి. మ‌రి తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఎందుకు ఫ్యామిలీ ఫోటోల‌తో రేష‌న్‌కార్డుల‌ను కేసీఆర్ స‌ర్కార్ ప్రింట్ చేయ‌లేదు. ఈట‌ల రాజేంద‌ర్ ఫోటో అందులో ముద్రించాలి కాబ‌ట్టి. అది కేసీఆర్ సుతారామూ ఇష్టం లేదు కాబ‌ట్టి. ఈట‌ల ఫోటో ఏమిటీ..? గ‌త సర్కార్ గోలేమిటీ..? అస్స‌లు అర్థం కావ‌డం లేదా..? చెబుతా చ‌ద‌వండి. గ‌త స‌ర్కార్‌లో మ‌న ఈట‌ల రాజేంద‌ర్ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగా ఉండే. ఆర్థిక శాఖ కూడా ఉండేనకో.

19Vastavam.in (3)

కొత్త రేష‌న్‌కార్డులు ప్రింట్ చేయాలంటే సీఎం ఫోటోతో పాటు సివిల్ స‌ప్లై శాఖ మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ ఫోటో కూడా ప్రింట్ చేయాలె. ఇది కేసీఆర్‌కు అస్స‌లే ఇష్టం లేదు. ఎందుకంటే ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి ట‌ర్మ్‌లో ఇద్ద‌రి మ‌ధ్య ట‌ర్మ్స్ బాగానే ఉన్నాయి. కానీ ఆ త‌రువాత ఈట‌ల త‌న సొంత ఐడెంటిటీని పెంచుతూ పోయాడు. స‌ర్కార్‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తూ రావ‌డం కేసీఆర్‌కు న‌చ్చ‌లేదు. అంతా త‌న చెప్పుచేత‌ల్లోనే ఉండాలె క‌దా. త‌ను చెబితే కూర్చోవాలె. అంతే. అదీ కేసీఆర్ స్టైల్‌. ఎవ‌రైనా లైన్ క్రాస్ చేస్తే తోక క‌ట్ చేసే ర‌కం. ఈట‌ల అలాగే చేశాడు.

అప్పట్నుంచి ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. రెండో ట‌ర్మ్ స‌ర్కార్ ఏర్ప‌డిన త‌రువాత మంత్రి వ‌ర్గంలో అస‌లు ఈట‌ల పేరే లేదు. చివ‌రి నిమిషం వ‌ర‌కు అదో క‌ల‌క‌లం. కేటీఆర్ జోక్యం చేసుకుంటేగానీ ఈట‌ల‌కు మంత్రి మండ‌లిలో చోటు ద‌క్క‌లేదు. అంత‌లా ప‌గ‌బ‌ట్టాడు కేసీఆర్‌. ఆ త‌రువాత మ‌ళ్లీ అవే శాఖ‌లిచ్చారు. కానీ అంత‌గా ప్ర‌యార్టీ లేదు. ఇక రేష‌న్‌కార్డుల ప్రింటింగ్ అంశం వ‌చ్చిన ప్ర‌తీసారి కేసీఆర్ దాటవేస్తూ వ‌చ్చాడు. అవి ముద్ర‌ణ వ‌ర‌కు పోతున్నాయి. వ‌స్తున్నాయి. కానీ ముద్ర‌ణ మాత్రం కావ‌డం లేదు. ఎందుకు..? ఈట‌లకు త్వ‌ర‌లో చెక్ పెట్టేందుకు అంతా రెడీ చేసుకుంటున్నాడు కేసీఆర్‌. ఇక ఫోటో ముద్రించి జ‌నాల మ‌ధ్య ఈ కార్డులు తిప్పాలా..? అందుకే డోన్ట్ కేర్ అన్నాడు కేసీఆర్‌. అందుకే మ‌న‌కు ప‌దేళ్ల‌కాలంలో రేష‌న్‌కార్డులు ప్రింట్‌కాలేదు. మ‌న ఫ్యామిలీల ఫోటోలు ముద్ర‌ణై మ‌న‌కు రాలేదు. ఇప్ప‌టికీ మీసేవాలో ప్రింట్ తీసుకున్న ఆ కాగిత‌పు ముక్క‌లే దిక్కు. అవి చిరిగి చిరిగి పోతే మ‌ళ్లీ కొత్త‌వి ప్రింట్ తీసుకుని వాటినే న‌డిపించేస్తున్నారు. అదీ మ‌న కేసీఆర్ అంటే. ప‌గ‌బ‌ట్టాడా..? వాడు చంక‌నాకి పోవాల్సిందే. టీ న్యూస్‌లో ఈట‌ల రాజేంద‌ర్ గురించి వార్త‌లు కూడా రాయించి త‌న క‌సి తీర్చుకున్నాడు. గుర్తుంది క‌దా. మ‌రేమ‌నుకుంటున్నారు.