వాస్తవం ప్రతినిధి – నల్లగొండ
29Vastavam.in (1)
రైతు ధర్నాలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రసంగం మధ్యలో దారిలో తనకో ఆటో డ్రైవర్ కలిశాడని, అతనితో ముచ్చటించానని చెప్పిన ఆయన… ఆ మాటలను అక్కడి సభ ముందుంచాడు. ఆటో డ్రైవర్‌తో మంచిచెడులు మాట్లాడిన తరువాత ఎలా ఉంది పాలన అని అడిగాడట కేటీఆర్. అందుకు బదులుగా అతగాడు ఏముంది.. సార్..! మరీ ఘోరంగా అయిపోయినయ్ మా బతుకులు. అప్పుడే బాగుండే అన్నాడట.
మరేం చేద్దాం.. మీరు ఓటేశారుగా .. ఏక్ ఓట్ పాంచ్ సాల్‌గా సజా… అన్నాడట కేటీఆర్. అంటే.. అంటే అప్పటి దాకా మనమేమీ చేయలేమా సార్ అని అడిగాడట ఆటోవాడు అమాయకంగా. ఏం చేస్తాం… ఇంకో నాలుగేండ్లు భరించాల్సిందే. ఓటేసినందుకు శిక్ష అనుభవించండి అని పరోక్షంగా తను అన్నమాటలను వివరించిన కేటీఆర్.. నాలుగేండ్లు మేం కొట్లాడేందుకు రెడీగా ఉన్నామని, మాతో కలిసిరావాలని వారికి విజ్ఞప్తి చేశాడు.